యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
నషా ముక్త్ యువ అభియాన్ అయిదో వారంలో భాగంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,174 కార్యక్రమాలు నిర్వహించిన మై భారత్
యోగా, ధ్యానం, మాదకద్రవ్యాల రహిత భారత్‌పై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న 3.43 లక్షల మంది యువత, పౌరులు
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 4:41PM by PIB Hyderabad
వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మేరా యువ భారత్ (మై భారత్) 100 వారాల ప్రచారంలో అయిదో వారాన్ని 2026 అక్టోబర్ 17న నిర్వహించింది. “మాదకద్రవ్యాల రహిత యువత కోసం యోగా, ధ్యానం”, “వికసిత్ భారత్ కోసం మాదకద్రవ్యాల రహిత యువతపై చర్చ” (పొరుగు ప్రాంత యువజన పార్లమెంట్) అనే అంశాలతో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఆధ్యాత్మిక సంస్థలు, విశ్వవిద్యాలయ సంఘాలు, పరిశ్రమల సంఘాల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమాలు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించాయి. మొత్తం 1,174 కార్యక్రమాల్లో 3,43,288 మంది యువత, పౌరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో నషా ముక్త్ యువ ప్రతిజ్ఞ, యోగా, ధ్యాన సాధన, అవగాహన చర్చలు, యువత భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యాలు. పొరుగు ప్రాంత యువజన పార్లమెంట్ చర్చలు మాదకద్రవ్యాల రహిత భారత్ లక్ష్య సాధనలో యువత చర్చించేందుకు, చురుగ్గా పాల్గొనేందుకు వేదికగా నిలిచాయి.
హార్ట్‌ఫుల్‌నెస్, ప్రాజెక్ట్ పాయింట్, సీఐపీయూ, అసోచామ్, ఫిక్కీ, సీఐఐ, బ్రహ్మకుమారీస్ వంటి భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ ప్రచారాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక సంస్థలు, పరిశ్రమల సంఘాలు, ఇతర భాగస్వామ్య వర్గాలు కలిసి కృషి చేయడం ద్వారా అవగాహనను బలోపేతం చేయడంతో పాటు, యువత, పౌరులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించాలనే సమష్టి సంకల్పం ఈ కార్యక్రమాల్లో ప్రతిబింబించింది.
ఈ ప్రచారంలో భాగంగా మొత్తం 3,380 కార్యక్రమాలు నిర్వహించగా, 3,43,288 మంది మాదకద్రవ్యాల రహిత భారత్ కోసం ప్రతిజ్ఞ చేశారు. ఇది మాదకద్రవ్య రహిత భారత్ పట్ల తమ నిబద్ధతను చాటడంలో యువత మరియు పౌరుల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడం, సమాజ స్థాయిలో అవగాహన పెంపొందించడం కోసం సమష్టి బాధ్యతను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమాలు వివిధ వర్గాల వారిని ఒకచోట చేర్చాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, భాగస్వామ్య సంస్థల సహకారంతో విస్తృత స్థాయిలో ప్రజలు పాల్గొనడం, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో నిరంతర సమాజ భాగస్వామ్యం ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. 100 వారాల ప్రచారం ద్వారా ‘వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ’ అనే లక్ష్య సాధన దిశగా యువత భాగస్వామ్యాన్ని, సమష్టి కార్యాచరణను మేరా యువ భారత్ నిరంతరం ప్రోత్సహిస్తోంది.
(రిలీజ్ ఐడి: 2325253)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4