ప్రధాన మంత్రి కార్యాలయం
మహానవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 1:11PM by PIB Hyderabad
సిద్ధిదాత్రి అమ్మవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజలు చేశారు.
మహానవమి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధిదాత్రి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
సిద్ధిదాత్రి అమ్మవారు భక్తులందరినీ సంకల్ప సిద్ధితో ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"దేశప్రజలందరికీ మహానవమి శుభాకాంక్షలు. ఈ పవిత్ర సందర్భంగా సిద్ధిదాత్రి అమ్మవారి పాదపద్మాలకు నా కోటి కోటి ప్రణామాలు! అమ్మవారు తన భక్తులందరికీ సంకల్ప సిద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను."
(రిలీజ్ ఐడి: 2325252)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam