ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐజీఐ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌లో... బ్యాంకాక్ నుంచి తెచ్చిన 148.67 కిలోల హైడ్రోపోనిక్ వీడ్‌ను గుర్తించిన కస్టమ్స్ అధికారులు

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 6:31PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని న్యూ కస్టమ్స్ హౌస్, ఎయిర్ కార్గో కాంప్లెక్స్ ఇంపోర్ట్‌కు చెందిన ఎస్‌ఐఐబి బ్రాంచ్ కస్టమ్స్ అధికారులు... మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాన్ని భగ్నం చేశారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా... బ్యాంకాక్ నుంచి వస్తున్న సరుకును అధికారులు అడ్డగించారు. తనిఖీల్లో గంజాయిగా అనుమానిస్తున్న ఆకుపచ్చ రంగు ఎన్‌డీపీఎస్ పదార్థాన్ని పీయూ ట్యూబ్‌ల స్పూల్స్‌లో దాచి ఉంచి అక్రమంగా తరలిస్తున్నట్లు కనుగొన్నారు.

19 కార్టన్లలో పీయూ ట్యూబ్‌లు ఉన్నట్లు పేర్కొన్న ఒక సరుకుకు సంబంధించిన తప్పుడు డిక్లరేషన్ అనుమానం రావడంతో అధికారులు దానిని నిలిపివేశారు. దిగుమతిదారు ప్రతినిధి సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో పీయూ ట్యూబ్‌లు ఉన్న ప్లాస్టిక్ రీళ్లు కనిపించగా... వాటిని పగలగొట్టి పరిశీలించినప్పుడు లోపలి రహస్య అరల్లో పాలిథిన్ కవర్లలో గట్టిగా చుట్టిన ఆకుపచ్చని పదార్థం పొట్లాలు బయటపడ్డాయి. ఇలాంటి పొట్లాలు మొత్తం 15 కార్టన్లలో లభ్యం కాగా, ప్రాథమిక నిర్ధారణ పరీక్షల్లో ఆ పదార్థం గంజాయిగా తేలింది.

మొత్తం 120 స్పూల్స్‌లో 148.67 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని దాచి ఉంచారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ సుమారు రూ. 52 కోట్లు కాగా, భారత్‌లో వీటి విలువ సుమారు రూ. 150 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఈ నిషేధిత సరుకుతో పాటు... దానిని దాచడానికి, ప్యాకేజింగ్ కోసం ఉపయోగించిన సామగ్రినీ ఎన్‌డీపీఎస్ చట్టం-1985 కింద అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఆపరేషన్ 72 గంటలకు పైగా కొనసాగింది. ఈ రోజు ఒక వ్యక్తి అరెస్టుతో ఇది ముగిసింది. నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మూడు రాష్ట్రాల్లోని అయిదు ప్రాంగణాల్లో జరిపిన తదుపరి సోదాలు... కొనసాగుతున్న దర్యాప్తునకు కీలకమైన ఆధారాలను అందించాయి. ఈ మొత్తం ఆపరేషన్‌ను చీఫ్ కమిషనర్, ఏసీసీ ఇంపోర్ట్స్ ప్రిన్సిపల్ కమిషనర్ స్థాయిలోని సీనియర్ కస్టమ్స్ అధికారులు నిశితంగా పర్యవేక్షించగా... ఏసీసీ ఇంపోర్ట్స్ అదనపు కస్టమ్స్ కమిషనర్ పర్యవేక్షించారు.

భారీ లాభాల ఆశతో స్మగ్లర్లు ఇటువంటి నిషేధిత పదార్థాలను అక్రమంగా దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ, మాదక ద్రవ్యాల ముప్పు నుంచి సమాజాన్ని రక్షించడానికి పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2324177) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil