మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్‌ పాలనను బలోపేతం చేసేందుకు డీబీఐఎం నిబంధనలతో రూపొందించిన

డీఏహెచ్‌డీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌

డీబీఐఎం నిబంధనలతో కూడిన డీఏహెచ్‌డీ వెబ్‌సైట్‌తో డిజిటల్‌ సేవల బలోపేతం, పారదర్శకమైన, సులభంగా అందుబాటులో ఉండే పౌర సేవలు: కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2026 4:41PM by PIB Hyderabad

దేశ డిజిటల్‌ పాలనా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ రూపొందించిన డిజిటల్‌ బ్రాండ్‌ ఐడెంటిటీ మాన్యువల్‌ (డీబీఐఎం) 3.0 నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన కొత్త  డీఏహెచ్‌డీ వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ  నేడు ప్రారంభించింది.

 

కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. “పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖకు చెందిన వెబ్‌సైట్‌ను డీబీఐఎం నిబంధనలకు అనుగుణంగా రూపొందించి ప్రారంభించడం.. డిజిటల్‌ సేవలను మరింత విస్తరించేందుకు, ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, పారదర్శకతను పెంపొందించడానికి, పౌరుల అవసరాలకు ప్రాధాన్యమివ్వడానికి దోహదపడే కీలక ముందడుగు. డిజిటల్‌ ఇండియా, కనీస ప్రభుత్వం–గరిష్ఠ పాలన అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం” అని అన్నారు.

 

ఈ వెబ్‌సైట్‌ రూపకల్పనలో కృషి చేసిన డీఏహెచ్‌డీ ఐటీ బృందం, ఎన్‌ఐసీలను కేంద్ర మంత్రి అభినందించారు. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కొత్త వెబ్‌సైట్‌ను సందర్శించి, అందులో అందుబాటులోకి తెచ్చిన మెరుగైన సదుపాయాలను వినియోగించుకోవాలని సంబంధిత వర్గాలకు ఆయన సూచించారు. పశువుల ఆరోగ్యం, పశుసంవర్ధక పథకాలు, పాడిపరిశ్రమ అభివృద్ధి, పశువుల నిర్వహణతో పాటు శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని తెలిపారు.

 

కొత్తగా ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ వినియోగదారులకు సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, వెబ్‌సైట్‌ నిర్వహణలో ఏకరూపతను, సులభమైన నావిగేషన్‌ సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో అధునాతన శోధన సదుపాయం, భాషిణి ద్వారా బహుభాషా మద్దతు, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన నావిగేషన్‌, కేంద్రీకృత సమాచార నిర్వహణ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.

 

పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖకు చెందిన ఈ వెబ్‌సైట్‌.. శాఖ అమలు చేస్తున్న ప్రధాన పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే సమగ్ర డిజిటల్‌ వేదికగా పనిచేస్తుంది. వీటిలో పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఏహెచ్‌ఐడీఎఫ్‌), జాతీయ గోకుల్‌ మిషన్‌ (ఆర్‌జీఎం), జాతీయ పశు సంపద మిషన్‌ (ఎన్‌ఎల్‌ఎం), పశు సంపద ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎల్‌హెచ్‌డీసీపీ) తదితర పథకాలు ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ ద్వారా పథకాలకు సంబంధించిన సమాచారం, మార్గదర్శకాలు, వనరులు, సంబంధిత డిజిటల్‌ వేదికలను సులభంగా పొందవచ్చు. తద్వారా శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై సంబంధిత వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం కొత్త డీఏహెచ్‌డీ వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.dahd.gov.in.

 

***


(రిలీజ్ ఐడి: 2323128) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी