ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాత కూష్మాండను పూజించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 9:24AM by PIB Hyderabad
నవరాత్రి ఉత్సవాల్లో దేవి దుర్గ నాలుగో అవతారమైన మాత కూష్మాండ అర్చన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
కూష్మాండ మాత అనంత శక్తి ప్రసారంతో దేశ ప్రజలందరి జీవితాల్లో కొత్త ఆశలు, సంతోషం, సౌభాగ్యం వెల్లివిరియాలని, వారికి మంచి ఆరోగ్యం కలగాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజు దేవీ మాత నాలుగో స్వరూపం మాత కూష్మాండను పూజించడం సంప్రదాయం. ఆ దేవీ మాత అనంత శక్తి ప్రసారంతో సమస్త దేశ ప్రజలందరి జీవితంలో కొత్త ఆశలు, సుఖ సమృద్ధులతో పాటు ఆరోగ్యం సిద్ధించాలని వేడుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2323120)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7