ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్న యూకే మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్

నాడు పోస్టు చేయడమైనది: 13 OCT 2026 10:07PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని యూకే మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ న్యూఢిల్లీలో కలుసుకున్నారు. ప్రజాపాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ పోస్టు పెట్టారు. ప్రధానమంత్రి నిబద్ధతను, పనితీరును, శక్తిని కొనియాడారు. వాణిజ్యం, సాంకేతికత, ఏఐ రంగాల్లో భారత్-యూకే సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

దీనికి స్పందిస్తూ 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ పోస్టు పెట్టారు.

"బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో ఇవాళ మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది".


(రిలీజ్ ఐడి: 2323117) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam