ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాత నారాయణి ఆశీస్సులను వేడుకొనే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 OCT 2026 9:13AM by PIB Hyderabad

మాత నారాయణికి వందనాలను అర్పించే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ సుభాషితం మాత నారాయణిని అత్యంత శుభకారిణి, దివ్యానుగ్రహ ప్రతీక, ధర్మబద్ధ కోరికలను నెరవేర్చే తల్లి అని కొనియాడుతున్నది. అలాగే, ఈ శ్లోకం దేవీమాతను శరణు కోరే వారికి రక్షకురాలుగా, దివ్య మాత గౌరిగా కూడా సంబోధిస్తున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘సర్వమంగలమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తు తే’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2323114) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam