ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అందరికీ శ్రేయస్సు, సమృద్ధి కలగాలని ప్రార్థిస్తూ సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 11:07AM by PIB Hyderabad

దేవీదేవతలందరి సామూహిక దివ్య శక్తులకు ప్రతీక మాత అంబిక. మాత అంబికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రార్థించారు. ఈ సందర్భంగా ఓ సంస్కృత సుభాషితాన్ని ఆయన ప్రస్తావించారు. మాత ఆశీర్వాదాలతో అందరికీ శ్రేయం, సౌభాగ్యం కలగాలని ప్రధాని కోరుకున్నారు.
‘‘దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేషదేవగణశక్తిసమూహమూర్త్యా
తామమ్బికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతాః స్మ విద్‌ధాతు శుభాని సా నః’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
అందరు దేవీదేవతలు, మహర్షులు పూజించే మాత అంబిక దివ్య శక్తిని ఈ శ్లోకంలో వేడుకోవడం జరుగుతోంది. మాత ఆశీస్సులు అందరికీ శుభాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదించాలన్నదే ఈ వేడుకోలు పరమార్థం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేషదేవగణశక్తిసమూహమూర్త్యా
తామమ్బికామఖిలదేవమహర్షిపూజ్యాం భక్త్యా నతాః స్మ విద్‌ధాతు శుభాని సా నః’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 2322204) సందర్శకుల సూచీ సంఖ్య : : 6