ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నానాజీ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

గ్రామీణాభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 11 OCT 2026 9:49AM by PIB Hyderabad

నానాజీ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. నిజమైన మార్పు గ్రామీణ స్థాయి నుంచే ప్రారంభమవుతుందని తన ఆలోచనలు, ఆచరణ ద్వారా నిరూపించిన ఒక విశిష్ఠ దేశ నిర్మాతగా ఆయనను ప్రధాని స్మరించుకున్నారు.

రాజకీయ సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక సామాజిక కార్యచరణతో మేళవించిన నానాజీ దేశ్‌ముఖ్.. గ్రామీణాభివృద్ధి, సమాజ భాగస్వామ్యానికి తన జీవితాన్ని అంకితం చేశారని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

సమర్థవంతమైన, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం నానాజీ దేశ్‌ముఖ్ కన్న కలలను సాకారం చేయడంలో దేశం ఏమాత్రం వెనుకాడదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"నానాజీ దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. నిజమైన మార్పు గ్రామీణ స్థాయి నుంచే ప్రారంభమవుతుందని తన ఆలోచనలు, ఆచరణ ద్వారా నిరూపించిన ఒక విశిష్ఠ దేశ నిర్మాతగా ఆయనను మనం ఎల్లప్పుడూ ఆత్మీయంగా స్మరించుకుంటాం. రాజకీయ సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక సామాజిక కార్యచరణతో మేళవించి గ్రామీణాభివృద్ధి, సమాజ భాగస్వామ్యానికి ఆయన తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. బలమైన, ఆత్మనిర్భర్ భారతదేశం నిర్మాణం పట్ల ఆయనకున్న దూరదృష్టిని  సాకారం చేయడానికి మేం శాయశక్తులా కృషి చేస్తాం."


(రిలీజ్ ఐడి: 2321951) సందర్శకుల సూచీ సంఖ్య : : 15