ఔషధాల విభాగం
క్యాన్సర్ మందుల ధరల నియంత్రణను విస్తరించిన ప్రభుత్వం.. క్యాన్సర్ రోగులకు వార్షికంగా రూ. 2,500 కోట్లు ఆదా అయ్యే అవకాశం
నాడు పోస్టు చేయడమైనది:
08 OCT 2026 10:04PM by PIB Hyderabad
1. ధరల నియంత్రణలో మరిన్ని మందులు
షెడ్యూల్డ్ జాబితాలో లేని క్యాన్సర్ నిరోధక ఔషధాల సరఫరా, విక్రయాలలో వసూలు చేసే లాభాల శాతంపై గరిష్ఠ పరిమితిని విధించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ లాభాల శాతాలు గరిష్ఠ రిటైల్ ధరలో (ఎంఆర్‌పీ) 30 శాతానికి పరిమితం చేసింది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70 శాతం వరకు తగ్గుతాయని.. క్యాన్సర్ రోగులు సొంత జేబు నుంచి వెచ్చించే సొమ్ము గణనీయంగా తగ్గి వార్షికంగా రూ. 2,500 కోట్లు ఆదా అవుతాయన్న అంచనా ఉంది.
షెడ్యూల్డ్ జాబితాలో చేర్చిన అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వం కఠినమైన గరిష్ఠ ధరల నిబంధనలను అమలు చేస్తోంది. తాజా నిర్ణయం ద్వారా ఆ జాబితాలో లేని మందులు అంటే నాన్‌షెడ్యూల్డ్ మందులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. రోగులకు చేరే వరకు ఈ ఔషధాల విషయంలో లాభాల శాతాన్ని ఇది పరిమితం చేస్తుంది.
ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డీజీహెచ్ఎస్) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈ జాబితాలో చేర్చాల్సిన మందులను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) తగిన నిర్ణయం తీసుకుని అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది.
2. క్యాన్సర్ చికిత్సలో తగ్గనున్న అధిక ఖర్చు
భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాలో దాదాపు 60 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ చికిత్స రోగులతో పాటు వారి కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతోంది. వారు తరచుగా సొంత జేబుల నుంచి భారీ మొత్తాలను వెచ్చించాల్సి వస్తోంది.
నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ నిరోధక ఔషధాలపై సగటున దాదాపు 170 శాతం వరకు అధిక ధర ఉంటోందని.. కొన్ని సందర్భాల్లో ఇది 700 శాతం లేదా అంతకంటే ఎక్కువకు చేరుకుంటోందని మార్కెట్ డేటాపై ఎన్‌పీపీఏ చేసిన విశ్లేషణలో తేలింది. సరళంగా చెప్పాలంటే.. ఆయా మందుల ధర సరఫరా గొలుసులోనే రోగులకు చేరేలోపు విపరీతంగా పెరుగుతోంది.
అలాగే ఆ మందులను రిటైల్ ఫార్మసీ, ఆసుపత్రి ఫార్మసీ లేదా ఆన్‌లైన్ ఫార్మసీ లలో ఎక్కడ కొనుగోలు చేస్తున్నారనే దానిని బట్టి కూడా ధరల్లో గణనీయమైన తేడాలు ఉంటున్నాయి.
లేనివి అనే అన్ని వర్గాల షెడ్యూల్ చేయని క్యాన్సర్ నిరోధక మందులు ఈ కొత్త పరిమితిలోకి వస్తాయి. తక్కువ ధరల ద్వారా రోగులు గణనీయమైన లబ్ధి పొందేలా చూడటంతో పాటు వారికి అవసరమైన మందులు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం అందుబాటులో ఉండేలా ఇది తోడ్పడుతుంది.రోగులకు మరింత తక్కువ ధరలకు మందులు అందేలా చూసుకుంటుంది.
3) 2019 నాటి నిర్ణయం ద్వారా చేకూర్చిన ఉపశమనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడం
ఈ లాభాలను పరిమితం చేయడం ద్వారా రోగులకు ఎంత ఎక్కువ ఉపశమనం లభిస్తుందో ప్రభుత్వం గతంలో తీసుకున్న చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
2019 ఫిబ్రవరిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్‌పీపీఏ.. ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు- 2013 లోని పేరా 19 కింద ఎంపిక చేసిన 42 షెడ్యూల్ చేయని క్యాన్సర్ నిరోధక మందులపై వాణిజ్య లాభాలను పరిమితం చేసింది.
ఆ నిర్ణయం ద్వారా గరిష్ట రిటైల్ ధరలు (ఎంఆర్‌పీ) 91 శాతం వరకు తగ్గాయి. 526 బ్రాండ్‌ల పరిధిలో వార్షికంగా రూ. 984 కోట్ల ఆదా అయినట్లు నివేదికలు వచ్చాయి. ఇది క్యాన్సర్ రోగులపై ఉన్న ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించింది.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది.
దీని నుంచి ప్రేరణ పొంది సరఫరా గొలుసులో గుర్తించిన ధరల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఇప్పుడు మరింత విస్తృతమైన ధరల పరిమితిని ఆమోదించింది. ఇప్పుడు వార్షికంగా రూ. 2,500 కోట్లు ఆదా అవుతాయన్న అంచనా ఉంది. ఇది క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు మరింత పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంది.
4) మందుల ఉత్పత్తిని నిలకడగా కొనసాగించడం, నిరంతరం అందుబాటులో ఉండేలా చూసేందుకు చర్యలు
ప్రాణాలను రక్షించే ఈ మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చూసేందుకు షెడ్యూల్ చేయని క్యాన్సర్ నిరోధక ఔషధాల తయారీదారులు తమ ప్రస్తుత ఉత్పత్తి స్థాయిలను యథావిధిగా కొనసాగించాల్సి ఉంటుంది.
బ్రాండెడ్, జనరిక్, దేశీయంగా తయారైనవి, దిగుమతి చేసుకున్నవి, పేటెంట్ పొందినవి, పేటెంట్ లేనివి అనే అన్ని వర్గాల షెడ్యూల్ చేయని క్యాన్సర్ నిరోధక మందులు ఈ కొత్త పరిమితిలోకి వస్తాయి. తక్కువ ధరల ద్వారా రోగులు గణనీయమైన లబ్ధి పొందేలా చూడటంతో పాటు వారికి అవసరమైన మందులు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం అందుబాటులో ఉండేలా ఇది తోడ్పడుతుంది.
****
(రిలీజ్ ఐడి: 2321123)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12