ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన జాంబియా దేశాధ్యక్షుడికి ప్రధాని శ్రీ మోదీ కృతజ్ఞతలు

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2026 7:14PM by PIB Hyderabad

ప్రభుత్వ అధిపతిగా దేశానికి 25 ఏళ్ల సేవా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా జాంబియా దేశ అధ్యక్షుడు శ్రీ హకైండే హిచిలేమా తనకు తెలిపిన శుభాకాంక్షలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

జాంబియాతో ఉన్న స్నేహ సంబంధాలను భారత్ ఎంతో విలువైనవిగా భావిస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

 

 

 

సామాజిక మాద్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

 

 

‘‘అధ్యక్షుడు హిచిలేమా గారూ, మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

 

 

 

జాంబియాతో స్నేహ సంబంధాలను భారత్‌ ఎంతో విలువైనవిగా భావిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’.

 

****


(రిలీజ్ ఐడి: 2321026) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Kannada