ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా

తనకు శుభాకాంక్షలు తెలిపిన గ్రెనడా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2026 7:21PM by PIB Hyderabad

ప్రభుత్వాధినేతగా దేశ సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన గ్రెనడా ప్రధానమంత్రి శ్రీ డికాన్ మిచెల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

 

భారత్-గ్రెనడాల మధ్య స్నేహానికి తాను ఎంతో విలువనిస్తాననీ, ఆ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

 

“ప్రధానమంత్రి డికాన్ మిచెల్ గారూ... మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత్-గ్రెనడా మధ్య స్నేహానికి నేను ఎంతో విలువనిస్తాను. మన సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను.” 


(రిలీజ్ ఐడి: 2321016) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada