ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతరిక్ష రంగంలో భారత్‌కు పెరుగుతున్న సామర్థ్యాలపై ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2026 6:41PM by PIB Hyderabad

అంతరిక్ష రంగానికి సంబంధించిన గ్లోబల్ స్పేస్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ కంపెనీ ‘దిగంతర’ వ్యవస్థాపకులు అనిరుధ్ శర్మ, తన్వీర్ అహ్మద్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

 

 

 

భారత్ వేగంగా స్వయంసమృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఈ వ్యాసం పేర్కొంది. గతంలో ఇతర దేశాలపై ఆధారపడిన అనేక రంగాల్లో ఇప్పుడు భారత్ స్వయంగా సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటోందని వివరించింది. అంతరిక్ష రంగంలో భారత్ తన సామర్థ్యాలను మరింత పెంచుకుంటోందని, కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తోందని వ్యాసంలో పేర్కొన్నారు. ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని, గుర్తింపును మరింత బలోపేతం చేసుకుంటోందని వివరించారు.

 

 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

 

 

 

‘‘భారత్‌ వేగంగా స్వావలంబన వైపు అడుగులు వేస్తోంది. ఒకప్పుడు ఏ వస్తువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చేదో, ఈనాడు అలాంటి అనేక ఉత్పత్తులను దేశంలోనే సొంతంగా తయారుచేసుకుంటున్నాం. గ్లోబల్ స్పేస్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ కంపెనీ దిగంతర వ్యవస్థాపకులు అనిరుధ్ శర్మ, తన్వీర్ అహ్మద్‌లు రాసిన ఈ వ్యాసంలో.. అంతరిక్ష రంగంలో భారత్ తన సామర్థ్యాలను ఎలా పెంచుకుంటోంది, నూతన సాంకేతికతను ఏ విధంగా అభివృద్ధి చేస్తోంది, ప్రపంచస్థాయిలో తనకంటూ ఒక బలమైన గుర్తింపును ఎలా సొంతం చేసుకుంటోందో స్పష్టంగా వివరించారు’’.


(రిలీజ్ ఐడి: 2321013) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Kannada , Malayalam