ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత నీటి నిర్వహణ విధానం విస్తృత 'గ్లోబల్ సౌత్' దేశాలకు ఉపయోగకరమైన పాఠాలను అందిస్తున్నదని తెలిపే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2026 3:18PM by PIB Hyderabad

భారత నీటి నిర్వహణ నమూనా విస్తృత గ్లోబల్ సౌత్‌ దేశాలకు ఏ విధంగా ఉపయోగకరమైన పాఠాలను అందిస్తోందనే అంశం గురించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. జల భద్రత అంటే కేవలం మౌలిక సదుపాయాలను నిర్మించడం మాత్రమే కాదనీ... మంచి ప్రణాళిక, పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో స్థానిక సమాజాలను భాగస్వామ్యం చేయడం ఇందులో భాగమేమని శ్రీ మోదీ పేర్కొన్నారు.

"గుజరాత్‌లో నీటి సంస్కరణల నుంచి భారీ-స్థాయి జాతీయ కార్యక్రమాల దాకా భారత్ సాగించిన ప్రయాణం... నీటి నిర్వహణను మెరుగుపరచుకోవడానికి, పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్న దేశాల కోసం ఒక ఆచరణాత్మక ఉదాహరణగా నిలుస్తుంది" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

భారత్‌లోని నీటి నిర్వహణ నమూనా విస్తృత గ్లోబల్ సౌత్‌ దేశాలకు ఉపయోగకరమైన పాఠాలను అందిస్తోంది. జల భద్రత అంటే కేవలం మౌలిక సదుపాయాలను నిర్మించడం మాత్రమే కాదు... మంచి ప్రణాళిక, పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో స్థానిక సమాజాలను భాగస్వామ్యం చేయడం ఇందులో భాగమే.

గుజరాత్‌లో నీటి సంస్కరణల నుంచి భారీ-స్థాయి జాతీయ కార్యక్రమాల దాకా భారత్ సాగించిన ప్రయాణం... నీటి నిర్వహణను మెరుగుపరచుకోవడానికి, పెరుగుతున్న నీటి అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న దేశాలకు ఒక ఆచరణాత్మక ఉదాహరణగా నిలుస్తుంది.

https://indianexpress.com/article/opinion/columns/from-india-to-global-south-a-gujarat-water-governance-model-10908115/lite/

***


(రిలీజ్ ఐడి: 2319645) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Malayalam