ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల మహిళల 65 కేజీల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన పర్వీన్‌ను అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 6:11PM by PIB Hyderabad

ఆసియా క్రీడలు- మహిళల 65 కేజీల బాక్సింగ్ విభాగంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న పర్వీన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

పర్వీన్ సాధించిన విజయం భారత బాక్సింగ్‌కు మరో సువర్ణ అధ్యాయాన్ని జోడిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఆమె విజయం ఎంతో స్ఫూర్తిదాయకం. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలనే విషయంగా పర్వీన్ అంకితభావానికి ఈ విజయం నిదర్శమని ఆయన పేర్కొన్నారు.

 

పర్వీన్ భవిష్యత్ ప్రయత్నాల కోసం శ్రీ మోదీ తన శుభాకాంక్షలు తెలిపారు.

 

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

 

అద్భుతమైన విజయం!

 

ఆసియా క్రీడల్లో హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో మహిళల 65 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న పర్వీన్‌కు అభినందనలు. ఆమె సాధించిన ఈ అద్భుతమైన విజయం భారత బాక్సింగ్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయాన్ని జోడిస్తుంది. ఆమె విజయం ఎంతో స్ఫూర్తిదాయకం. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలనే విషయంగా పర్వీన్ అంకితభావానికి ఈ విజయం నిదర్శనం. పర్వీన్ భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు. 

 

****


(రిలీజ్ ఐడి: 2318406) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Gujarati , Malayalam