బొగ్గు మంత్రిత్వ శాఖ
గాంధీ జయంతి వేడుకలతో ఎస్ఈసీఎల్‌లో ఘనంగా ముగిసిన 'స్వచ్ఛతా హి సేవా 2026' ప్రచారం
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని ఎస్ఈసీఎల్ కార్యకలాపాల ప్రాంతాల్లో 55కు పైగా నిర్దేశిత యూనిట్లలోనూ, 10 లక్షల చదరపు అడుగుల ప్రాంతంలోనూ స్వచ్చతా పనులు... ప్రత్యేక ప్రచారం 6.0 అమలు దశ ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 4:52PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలోని తన అన్ని కార్యాలయాలు, ప్రాజెక్టుల్లో నేడు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలతో 'స్వచ్ఛతా హి సేవా 2026' ప్రచారాన్ని ఘనంగా ముగించింది.
2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించిన ఈ ప్రచారంలో భాగంగా ఎస్ఈసీఎల్ పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని తన కార్యకలాపాల పరిధిలో లక్ష్యంగా పెట్టుకున్న 55 పైగా యూనిట్లలో విస్తృత పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టింది.
ఈ ప్రచారంలో భాగంగా వీధి నాటకాలు, పాఠశాలల్లో పోటీలు, శ్రమదానం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలతో సహా విస్తృతమైన చైతన్య, సమాజ భాగస్వామ్య కార్యక్రమాలను చేపట్టారు. పరిశుభ్రతను ప్రోత్సహించడం, ప్రజల్లో ప్రవర్తనా మార్పును తీసుకురావడం లక్ష్యంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్వచ్ఛతా హీ సేవా 2026 ముగింపు దశతో పాటు ప్రత్యేక ప్రచారం - 6 అమలు దశ కూడా ప్రారంభమైంది. 2026 సెప్టెంబర్ 30న సన్నాహక దశ పూర్తికాగా, ఈ రోజు (అక్టోబర్ 2) అమలు దశ ప్రారంభమై అక్టోబర్ 31, 2026 వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రచారంలో ఈ - వ్యర్థాల సమర్థవంతమైన సేకరణ, వేరు చేయడం, శాస్త్రీయంగా నిర్మూలించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఎస్ఈసీఎల్ లో ప్రత్యేక ప్రచారం - 6 అమలు ప్రారంభం
ప్రత్యేక ప్రచారం -6లో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణకు ఎస్ఈసీఎల్ దేశవ్యాప్తంగా 225 ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యక్రమం కింద సుమారు 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని శుభ్రం చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ప్రచార కాలంలో 3,300 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించి పారవేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
రికార్డుల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీఎల్ 500 ఫైళ్లను పరిశీలించి, 200 ఫైళ్లను, 7,000 ఈ - ఫైళ్లను సమీక్షించి, 3,000 ఈ-ఫైళ్లను తొలగించనుంది.
అమలు దశలో పరిశుభ్రత, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించడం, వ్యర్థాల తొలగింపు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ పనులను తగ్గించడం, ఈ - వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమాలు ఎస్ఈసీఎల్ ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ కార్యకలాపాలు నిర్వహించే అన్ని ప్రాంతాల్లో చేపట్టనున్నారు.
స్వచ్ఛతా హీ సేవా 2026 కింద చేపట్టిన కార్యక్రమాలు, ఆరో దశ ప్రత్యేక ప్రచారం ప్రారంభం - పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం, కార్యాలయ నిర్వహణలో సమర్థత, వ్యర్థాలను బాధ్యతాయుతంగా తొలగించడంపై ఎస్ఈసీఎల్ నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2318395)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8