ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వాధీనం చేసుకున్న 10.84 టన్నులకు పైగా మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన సీబీఎన్‌ మధ్యప్రదేశ్ యూనిట్‌; 154.375 కిలోల నల్లమందు నీమచ్‌లోని జీఓఏడబ్ల్యూకు అప్పగింత

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 3:22PM by PIB Hyderabad

చట్టబద్ధమైన విధానాలకు అనుగుణంగా జప్తు చేసిన మత్తు పదార్థాలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు చేపడుతున్న నిరంతర చర్యలలో భాగంగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్ ) మధ్యప్రదేశ్ యూనిట్ స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న మధ్యప్రదేశ్‌లోని ఖోర్‌లో ఉన్న విక్రమ్ సిమెంట్ కర్మాగారంలో ధ్వంసం చేసింది.

 

ఈ నిర్మూలన ప్రక్రియలో భాగంగా, డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణలో, మధ్యప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధి సమక్షంలో ఎన్‌డీపీఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకారం సీబీఎన్ అధికారులు 10,842.150 కిలోగ్రాముల జప్తు చేసిన మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు. దీనితో పాటు, నిర్మూలన ప్రక్రియలో భాగంగా స్వాధీనం చేసుకున్న 154.375 కిలోగ్రాముల నల్లమందును నీముచ్‌లోని ప్రభుత్వ అఫియోమ్ అండ్ ఆల్కలాయిడ్ ఫ్యాక్టరీకి అప్పగించారు.

 

ధ్వంసం చేసిన మత్తు పదార్థాల వివరాలు క్రింద విధంగా ఉన్నాయి:

 

 వరస నెం.. 

 

 మత్తు పదార్ధం 

 

పరిమాణం 

 

1.

 

 పాపీ స్ట్రా

 

10,823.990 కేజీ 

 

2.

 

మెఫెడ్రోన్

 

3.175 కేజీ

 

3.

 

చరస్

 

7.400 కేజీ

 

4.

 

హెరాయిన్ 

 

7.535 కేజీ

 

5.

 

బ్రౌన్ షుగర్ 

 

0.050 కేజీ

 

 

 

మొత్తం 

 

10,842.150 కేజీ

 

 

 

 

స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు తిరిగి అక్రమ రవాణా వ్యవస్థలోకి ప్రవేశించకుండా నిరోధించడంతో పాటు, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా సురక్షితమైన పద్ధతిలో వాటిని కాల్చివేసేందుకు సీబీఎన్ చట్టపరమైన నిబంధనలు, నిర్దేశిత ప్రక్రియల ప్రకారమే చర్యలను చేపడుతోంది. 

 

 

మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సీబీఎన్ సమగ్ర విధానాన్ని అవలంబిస్తోంది. సమాచార ఆధారిత తనిఖీలు, అక్రమ పదార్థాల జప్తు, కేసుల విచారణ, నిందితులపై చర్యలతో పాటు చట్ట ప్రకారం పట్టుబడిన మత్తు పదార్థాలను ఎప్పటికప్పుడు నిర్మూలించే చర్యలను నిరంతరం కొనసాగిస్తోంది.

 

మాదకద్రవ్య రహిత భారతదేశం సాకారం దిశగా సమష్టి కృషి చేయడంతో పాటు, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్‌ పదార్థాల అక్రమ రవాణాపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలన్న తన లక్ష్యానికి సీబీఎన్‌ కట్టుబడి ఉంది.


(రిలీజ్ ఐడి: 2318385) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी