ప్రధాన మంత్రి కార్యాలయం
2026 ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ విభాగంలో రజతం గెలిచిన ప్రిన్స్ నోబుల్, మను ఫ్రాన్సిస్‌లకు ప్రధాని అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 4:41PM by PIB Hyderabad
2026 ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ విభాగంలో రజత పతకం సాధించిన ప్రిన్స్ నోబుల్, మను ఫ్రాన్సిస్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
తమ పాత రికార్డులను తామే తిరగరాస్తూ ఈ ద్వయం విజయ వేదికపై నిలిచిందని వ్యాఖ్యానించారు. నైపుణ్యం, పట్టుదలతో సాధించిన ఈ విజయాన్ని.. వారి క్రీడాప్రయాణంలో ప్రశంసనీయమైన పురోగతిగా ప్రధానమంత్రి అభివర్ణించారు.
ప్రిన్స్ నోబుల్, మను ఫ్రాన్సిస్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలంటూ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“ఈ రజత పతకం ఎంతో ప్రత్యేకం.. అద్భుతం!
2026 ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ విభాగంలో రజత పతకం సాధించిన ప్రిన్స్ నోబుల్, మను ఫ్రాన్సిస్‌లకు అభినందనలు.
తమ గత రికార్డులను తిరగరాస్తూ.. అద్భుత ప్రదర్శనతో ఈ సారి వారు విజయవేదికపై నిలిచారు. నైపుణ్యం, పట్టుదలతో సాధించిన ఈ విజయం.. వారి క్రీడాప్రయాణంలో అద్భుత పురోగతి. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు.:PM @narendramodi
(రిలీజ్ ఐడి: 2318305)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil