పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
భాగస్వామ్య పక్షాలు, ప్రజల సంప్రదింపుల కోసం పెట్రోలియం (సవరణ) ముసాయిదా బిల్లు- 2026
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 12:06PM by PIB Hyderabad
పెట్రోలియం (సవరణ) బిల్లు- 2026 ముసాయిదా, ఈ సవరణల ముఖ్యాంశాలతో క్లుప్తంగా రూపొందించిన వివరణాత్మక నివేదికలను 2026 సెప్టెంబర్ 30న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. చట్టరూపం దాల్చడానికి ముందు నిర్వహించే సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానిస్తూ ఈ ప్రతిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. https://mopng.gov.in/files/Whatsnew/Draft-Amendment-to-the-Petroleum-Act.pdfలో బిల్లు ప్రతిని పొందవచ్చు.
సంబంధిత భాగస్వామ్య పక్షాలు, ప్రజలు ఈ ముసాయిదా బిల్లుపై తమ అభిప్రాయాలు, సూచనలను.. ‘అండర్ సెక్రటరీ (పంపిణీ), పెట్రోలియం - సహజ వాయువు మంత్రిత్వశాఖ, కర్తవ్య భవన్-03, న్యూఢిల్లీ-110001’ చిరునామాకు సమర్పించాల్సిందిగా మంత్రిత్వశాఖ కోరుతోంది. లేదా లేదా 2026 అక్టోబర్ 30లోగా sodist-png[at]gov[dot]in, richa.86[at]nic[dot]in లకు ఇ-మెయిల్ ద్వారా కూడా సలహాలు, సూచనలను అందించవచ్చు.
సంప్రదింపుల ప్రక్రియలో స్వీకరించిన అభిప్రాయాలను తగిన విధంగా పరిశీలిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2317400)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8