ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల ట్రాప్ టీమ్ విభాగం రజత విజేతలు మనీషా కీర్.. నీరూ.. ఆషిమా అహ్లావత్‌లకు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2026 6:45PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో మహిళల ట్రాప్ టీమ్ విభాగం రజత పతక విజేతలు మనీషా కీర్, నీరూ, ఆషిమా అహ్లావత్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

అత్యంత కచ్చితత్వం, ఏకాగ్రత, సమష్టి కృషితో వారు అద్భుత ప్రతిభను ప్రదర్శించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

 

భవిష్యత్తులోనూ ఈ బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, దేశ కీర్తిప్రతిష్టలను వారు మరింత ఇనుమడింపజేయగలరని శ్రీ మోదీ ఆశాభావం వెలిబుచ్చారు.

 

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:

 

“ఆసియా క్రీడలలో మహిళల ట్రాప్ టీమ్ విభాగం రజత విజేతలు మనీషా కీర్, నీరూ, ఆషిమా అహ్లావత్‌లకు నా హృదయపూర్వక అభినందనలు. వారి ఏకాగ్రత, కచ్చితత్వం, సమష్టి కృషికి లభించిన ప్రశంసనీయ విజయమిది. ఈ బృందం ఇంతకన్నా మెరుగ్గా రాణిస్తూ దేశానికి మరింతగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిపెట్టాలని ఆశిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు తెలిపింది: PM @narendramodi”

 

****


(రిలీజ్ ఐడి: 2316734) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil