శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశీయంగా మల్టీ-గ్యాస్ సెన్సింగ్ ప్లాట్‌ఫామ్ తయారీకి

రూ. 37.51 కోట్ల ఆర్‌డీఐ మద్దతు కోసం 'మల్టీ నానో సెన్స్ టెక్నాలజీస్'తో ఒప్పందం కుదుర్చుకున్న టీడీబీ

టీఆర్ఎల్-4 నుంచి టీఆర్ఎల్-9 స్థాయికి పెరగనున్న ఎంఈఎంఎస్-ఆధారిత సెన్సార్, ఏఎఫ్ఈ ఎస్ఓసీలు.. దీనితో బలోపేతం కానున్న భారత అధునాతన సెన్సార్, సెమీకండక్టర్ సాంకేతికతల సామర్థ్యాలు

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2026 5:14PM by PIB Hyderabad

పారిశ్రామిక భద్రత, హైడ్రోజన్ మౌలిక సదుపాయాల నుంచి ఇంధన వ్యవస్థలు, ప్రక్రియ పర్యవేక్షణ వరకు వాయువులను గుర్తించడం, వాటిని కచ్చితంగా కొలవడం వంటి సామర్థ్యాలు అనేక రకాల వర్ధమాన సాంకేతికతలు రోజు రోజుకూ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఈ రంగంలో స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ (డీఎస్‌‍టీ) ఆధ్వర్యంలోని టీడీబీ (టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన మల్టీ నానో సెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్‌డీఐ) నిధి కింద రూ. 37.51 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొత్తం రూ. 75.02 కోట్ల ఆమోదిత వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్ట్ 'ప్లాట్‌ఫార్మ్ ఎంఈఎంఎస్ + ఏఎఫ్ఈ ఎస్ఓసీ మల్టీ-గ్యాస్ సెన్సార్' అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ సాంకేతికతను టీఆర్ఎల్-4 నుంచి టీఆర్ఎల్-9 స్థాయికి తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యం. ఆప్షనల్లీ కన్వర్టబుల్ డెట్(ఓసీడీ) ద్వారా ఈ ఆర్థిక సహాయం అందుతుంది.

 

చిన్న పరిమాణంలో నమ్మదగిన, విస్తరించదగిన మల్టీ-గ్యాస్ సెన్సింగ్‌ను సులభతరం చేసే లక్ష్యంతో మల్టీ నానో సెన్స్ సంస్థ స్వదేశీ ఎంఈఎంఎస్ టీసీడీఐఆర్ గ్యాస్ సెన్సార్, సీఎంఓఎస్ ఏఎఫ్ఈ ఎస్ఓసీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ సాంకేతికత ఎంఈఎంఎస్ ఆధారిత సెన్సింగ్ మూలకాన్ని సిగ్నల్ సముపార్జన, ప్రాసెసింగ్ కోసం అప్లికేషన్-నిర్దిష్ట ఫ్రంట్-ఎండ్ సిస్టమ్-ఆన్-చిప్‌తో మిళితం చేస్తుంది. రిఫైనరీలు, పెట్రోకెమికల్స్, పవర్, పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక భద్రత, బ్యాటరీలు, హైడ్రోజన్ ఎకానమీతో సహా వివిధ పరిశ్రమల్లో సంభావ్య అనువర్తనాలతో లీక్ డిటెక్షన్, ప్రక్రియ నియంత్రణ, హెల్త్ అండ్ సేఫ్టీ మానిటరింగ్ వంటి అప్లికేషన్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగపడుతుంది.

 

ప్రతిపాదిత సెన్సార్ ప్లాట్‌ఫామ్ అధిక సెన్సిటివిటీ, తక్కువ విద్యుత్ వినియోగం, సూక్ష్మీకరించిన- ఇంటెలిజెంట్ సిగ్నల్ ప్రాసెసింగ్ కలయికతో పాటు ఎంఈఎంఎస్ గ్యాస్ సెన్సార్, కస్టమ్ ఏఎఫ్ఈ ఎస్ఓసీలతో రూపొందించారు. ఈ సాంకేతికత విస్తృత ఉష్ణోగ్రత శ్రేణిలో, కష్టతరమైన పారిశ్రామిక వాతావరణాలలో పనిచేస్తుంది. అదే సమయంలో ఆటో-క్యాలిబ్రేషన్, పర్యావరణ ప్రమాణాల కోసం పరిహారం, పర్యావరణ పరిస్థితుల (ఉష్ణోగ్రత, తేమ మొదలైనవి) వల్ల కలిగే మార్పులను సరిదిద్దడం లేదా సర్దుబాటు చేయడం, సాఫ్ట్‌వేర్ ఆధారిత గ్యాస్-లైబ్రరీ ప్రాసెసింగ్ (వివిధ వాయువుల సమాచార నిధిని ఉపయోగించి విశ్లేషించడం) వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంటుంది. 200 మిలీసెకన్ల కంటే తక్కువ ప్రతిస్పందన సమయాన్ని లక్ష్యంగా చేసుకొని వేగవంతమైన గుర్తింపు, పర్యవేక్షణ అవసరమయ్యే అప్లికేషన్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 25 మి.మీ. × 25 మి.మీ. × 15 మి.మీ. కన్నా తక్కువ పరిమాణంలో రూపొందించిన సెన్సార్ ప్యాకేజీతో కూడిన దీని చిన్న సైజు ఆర్కిటెక్చర్ బ్యాటరీతో నడిచే, ఎంబెడెడ్ అప్లికేషన్‌లకు అవకాశాన్ని కల్పిస్తుంది. 

ఆర్‌డీఐ మద్దతుగల ఈ కార్యక్రమం ద్వారా మల్టీ నానో సెన్స్ సంస్థ సెన్సార్, ఏఎఫ్‌ఈ ఎస్ఓసీ ప్లాట్‌ఫామ్ తదుపరి అభివృద్ధి, ఇంటిగ్రేషన్, పరీక్ష, ధ్రువీకరణ, స్థాయి పెంపుదల వంటి ప్రక్రియలను చేపట్టగలదు. ఈ సాంకేతికతను టీఆర్ఎల్-9 స్థాయికి తీసుకెళ్లటమే దీని అంతిమ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ డీప్ టెక్నాలజీ కిందకు వస్తుంది. ఇందులో క్వాంటం సాంకేతికతను ఉప-రంగంగా గుర్తించారు. తక్షణ అప్లికేషన్ అధునాతన మల్టీ-గ్యాస్ సెన్సింగ్ అయినప్పటికీ దీని అంతర్లీన ప్లాట్‌ఫామ్ ఎంఈఎంఎస్, సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్, ఇంటెలిజెంట్ సెన్సింగ్‌లను ఒకచోట చేర్చుతుంది. స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడానికి ఇవి ఎంతో ముఖ్యమైన రంగాలు.

 

టీడీబీ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ.. "అనేక ఆధునిక సాంకేతిక వ్యవస్థలకు సెన్సార్లు పునాది వంటివి. పారిశ్రామిక పోటీతత్వం, వ్యూహాత్మక ఆత్మనిర్భరత రెండింటికీ సెన్సింగ్, సెమీకండక్టర్ సాంకేతికతలలో స్వదేశీ సామర్థ్యాలు ఎంతో ముఖ్యం. వాణిజ్యపరంగా విస్తృతంగా ఉపయోగించే స్థాయికి చేరుకోవటానికి ముందు చాలా కాలం పాటు అభివృద్ధి అవసరమయ్యే సాంకేతికతలకు మద్దతు ఇవ్వడానికి ఆర్‌డీఐ నిధి మాకు సహాయపడుతుంది. మల్టీ నానో సెన్స్ సంస్థతో కుదిరిన ఈ ఒప్పందం.. అధునాతన సెన్సార్ సాంకేతికతలను అభివృద్ధి దశ నుంచి కొలవదగిన, మార్కెట్-సిద్ధంగా ఉండే పరిష్కారాలుగా తీర్చిదిద్దడానికి ఇటువంటి మద్దతు ఏ విధంగా సహాయపడుతుందో తెలియజేస్తుంది" అని పేర్కొన్నారు.

 

మల్టీ నానో సెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి మాట్లాడుతూ.. "టీడీబీ నుంచి లభించిన ఆర్‌డీఐ మద్దతు మా ఎంఈఎంఎస్ గ్యాస్-సెన్సింగ్ సాంకేతికతను ఇంటిగ్రేషన్, ధ్రువీకరణ, స్థాయి పెంపుదల విషయంలో తదుపరి దశకు తీసుకెళ్లడానికి మాకు వీలు కల్పిస్తుంది. పరిశ్రమలవారీగా ఉండే కఠినమైన అవసరాలను తీర్చగల చిన్న సైజు, తక్కువ విద్యుత్ వినియోగం గల, విస్తరించదగిన మల్టీ-గ్యాస్ సెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈ సాంకేతికతను టీఆర్ఎల్-9 స్థాయికి తీసుకెళ్లడంలో, ఎంఈఎంఎస్- సెన్సార్ ఎలక్ట్రానిక్స్‌లో స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈ మద్దతు ఎంత కీలకమైనదిగా నిలుస్తుంది" అని తెలిపారు.

****

 


(రిలీజ్ ఐడి: 2316733) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी