సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టరును రూపొందించి, బలోపేతం చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ, గణాంకాలు-కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి
ఒక సువ్యవస్థిత ఫ్రేంవర్కును సిద్ధం చేయడంలో తోడ్పడనున్న ఎంఓయూ
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 1:33PM by PIB Hyderabad
స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్ (ఎస్‌బీఆర్)ను రూపొందించి, బలోపేతం చేయడానికి తత్సంబంధిత సమాచారాన్ని పంచుకోవడంతో పాటు ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) మంత్రిత్వ శాఖ, గణాంకాలు-కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఎస్‌పీఐ) ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎమ్ఓయూ) ఇచ్చి పుచ్చుకున్నాయి.
అవగాహన ఒప్పంద పత్రంపై ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, డెవలప్‌మెంట్ కమిషనరు డాక్టర్ రజనీశ్, ఎమ్ఓఎస్‌పీఐ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ దలీప్ సింగ్ సంతకాలు చేశారు. రెండు మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అవగాహన ఒప్పందం లక్ష్యాలు:-
• ఎమ్ఎస్ఎమ్ఈ విభాగం వద్ద ఉన్న ఉద్యమ్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన యూనిట్ వారీ సమాచారాన్ని ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ, ఎమ్ఓఎస్‌పీఐలు ఏపీఐల సాయంతో పంచుకోవడానికి షరతులను, అవగాహనను ఈ ఎమ్ఓయూ నిర్ధేశిస్తుంది. నేషనల్ స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్ (ఎన్ఎస్‌బీఆర్)ను రూపొందించడానికి అవసరమైన సమాచారాన్ని ఈ రెండు పక్షాల ఏపీఐ సమకూరుస్తుంది.
• ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ విస్తారిత అనుబంధ వ్యవస్థ నుంచి సంబంధిత సమాచారాన్ని గణాంకాలు-కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖతో కలిసి పంచుకోవడానికి ఓ సువ్యవస్థిత ఫ్రేంవర్కును సిద్ధం చేయడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. గణాంక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఉపయోగించే బిజినెస్ సమాచార విస్తృతి, ఏకరూపత, విశ్వసనీయతలను మెరుగుపరచడానికి ఈ సమాచారం దోహదం చేస్తుంది.
స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్ (ఎస్‌బీఆర్) దేనికంటే:
• స్టాటిస్టికల్ బిజినెస్ రిజిస్టర్ (ఎస్‌బీఆర్) ఒక కేంద్రీయ, నిర్దిష్ట కాల ప్రాతిపదికన తాజా సమాచారాన్ని పొందుపరుస్తూ ఉండే సమాచార నిధి (డేటా బేస్). దీనిలో ఒక పారిభాషిక భౌగోళిక క్షేత్ర పరిధిలో ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమైన నమోదిత గణాంక యూనిట్ల వివరాలు ఉంటాయి.
దీనిలో వ్యాపార, వాణిజ్య, ఇతర సందర్భశుద్ధి కలిగి ఉండే ఆర్థిక విభాగాలు, ఆర్థిక విభాగాల ప్రధాన విశేషాలు, వివిధ విభాగాల మధ్య ఉండే సంబంధాలను నమోదు చేస్తారు.
• ఆర్థిక గణాంకాల వ్యవస్థకు ఒక మూలాధార మౌలిక సదుపాయంగా ఎస్‌బీఆర్ పనిచేస్తుంది. దీని వల్ల ఆర్థిక సర్వేలకు లక్షిత జనాభాను గుర్తించి, సర్వే నమూనాను ఎంపిక చేయడానికి తోడ్పడడం, బిజినెస్ డెమోగ్రఫీ స్టాటిస్టిక్స్ రూపకల్పనకు దోహదం చేయడం, బిజినెస్ డెమోగ్రఫీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక ఉమ్మడి ఫ్రేంవర్కును సమకూర్చడం, వివిధ సమాచార మూలాల్లో (డేటా సోర్సెస్) ఏకీకరణకు, స్థిరత్వానికి మార్గాన్ని సుగమం చేసి వ్యాపార సమాచార కవరేజిని, సుస్థిరతను, విశ్వసనీయతను మెరుగుపరిచేందుకు వీలవుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2316726)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9