ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విజయం సాధించేందుకు అవసరమైన ఆరు గుణాలను తెలిపే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 SEP 2026 8:48AM by PIB Hyderabad

ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, కార్యసాధనా సామర్థ్యం, జ్ఞానం, వీరత్వం వంటి ఆరు గుణాలను తెలిపే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ గుణాలను అలవరచుకున్న వ్యక్తి... విజయం సాధించేందుకు దైవానుగ్రహాన్ని పొందుతాడని స్పష్టం చేశారు.

సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి:

ఉద్యమః సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమః

షడేతే యత్ర వర్తన్తే తత్ర దైవం సహాయకృత్

ఏ వ్యక్తి అయితే ఈ ఆరు గుణాలు… ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, కార్యసాధనా సామర్థ్యం, జ్ఞానం, వీరత్వం కలిగి ఉంటాడో, అతను విజయం సాధించేందుకు దైవ సహాయాన్ని పొందుతాడని ఈ సుభాషితం తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

ఉద్యమః సాహసం ధైర్యం బుద్ధిః శక్తిః పరాక్రమః

షడేతే యత్ర వర్తన్తే తత్ర దైవం సహాయకృత్


(రిలీజ్ ఐడి: 2316370) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam