ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకం సాధించిన విత్యా రామరాజ్‌కు ప్రధానమంత్రి అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 9:19PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకం సాధించిన విత్యా రామరాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అభినందించారు.

ఆమె అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విత్యకు అభినందనలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

“విత్యా రామరాజ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు! ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకం సాధించిన విత్యకు అభినందనలు. రానున్న రోజుల్లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పేర్కొంది.


(రిలీజ్ ఐడి: 2316369) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam