రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోటి మైలురాయిని తాకిన ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 5:27PM by PIB Hyderabad

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల నుంచి లభిస్తున్న బలమైన ఆదరణను ప్రతిబింబిస్తూ 2025 ఆగస్టు 15న ప్రారంభించిన 'ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌' కోటి మంది వినియోగదారుల మైలురాయిని దాటింది. ఇది జాతీయ, ఎక్స్‌ప్రెస్‌ రహదారులపై ప్రయాణాన్ని సులభతరం చేయటం, నిరాటకంగా మార్చటమే కాకుండా మరింత అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చింది. ఈ తాజా పరిణామం ప్రైవేట్ వాహనదారుల నుంచి ఈ వార్షిక పాస్‌కు పెరుగుతున్న మద్దతును తెలియజేస్తోంది.

జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌ రహదారులపై సుమారు 1,150 టోల్ ప్లాజాలకు వర్తించే ఈ వార్షిక పాస్.. రూ. 3,075 ఒకేసారి చెల్లించడం ద్వారా (ఒక సంవత్సరం చెల్లుబాటు కాలం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌ల కోసం) ఫాస్టాగ్‌ను తరచూ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్‌ కలిగిన అన్ని వాణిజ్యేతర వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఒక్కసారి రుసుం చెల్లించిన తర్వాత వాహనానికి అనుసంధానమైన ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌పై ఈ వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. 

ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు పెరుగుతున్న ఆదరణ.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై సులభమైన, ఆర్థికవంతమైన ప్రయాణాన్ని ప్రోత్సహించడంలో దాని ప్రభావాన్ని మరింత బలపరుస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2316276) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Malayalam