రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో విజయవాడ మీదుగా మచిలీపట్నం-కర్నూలు మధ్య


వారానికి మూడుసార్లు నడిచే కొత్త రైలుకు భారతీయ రైల్వే ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ, వినుకొండ, నంద్యాల సహా ఇతర కీలక స్టేషన్లకు నేరుగా రైలు కనెక్టివిటీని అందించడానికే కొత్త రైలు

నాడు పోస్టు చేయడమైనది: 28 SEP 2026 5:33PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు పెద్ద ఊరటనిస్తూ, సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోని విజయవాడ మీదుగా మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్తగా వారానికి మూడు రోజులు నడిచే రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలోని తీరప్రాంతం నుంచి మధ్య ప్రాంతాలకు అదనపు రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

తాజాగా ఆమోదం పొందిన మచిలీపట్నం- కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్ 499 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది మచిలీపట్నం నుంచి 16:55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:45 గంటలకు కర్నూలు సిటీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, కర్నూలు సిటీ- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ కర్నూలు సిటీ నుంచి 09:30 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి 21:35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

 

మచిలీపట్నం-కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్ సోమ, బుధ, శనివారాల్లో నడుస్తుంది. కర్నూలు సిటీ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ మంగళ, గురు, ఆదివారాల్లో నడుస్తుంది.

అనుసంధానించనున్న ప్రధాన స్టేషన్లు

ఈ కొత్త రైలు కింది ప్రదేశాల్లో ఆగనుంది:

గుడివాడ

విజయవాడ

నరసరావుపేట

వినుకొండ

దొనకొండ

మార్కాపూర్ రోడ్

కంబమ్

గిద్దలూరు

దిగువమెట్ట

నంద్యాల

బేతంచెర్ల

డోన్

ఈ కొత్త రైలు సేవ ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు అదనపు ప్రయాణ అవకాశాన్ని కల్పించడంతో పాటు... మచిలీపట్నం, విజయవాడ, కర్నూలు నగరాల మధ్య రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. ఈ మార్గంలోని అనేక పట్టణాలు, నగరాలకు రాకపోకల సౌలభ్యాన్నీ మెరుగుపరుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2316274) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Telugu_Vw , Kannada