ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ పోటీలో కాంస్య పతక విజేత పారుల్ చౌదరి కి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 SEP 2026 9:24PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ పోటీలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పారుల్ చౌదరీ అద్భుత ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసిస్తూ, అభినందనలు తెలిపారు.
విజయ వేదిక వద్దకు ఆమె చేరుకోవడంతో పాటు అత్యుత్తమ వ్యక్తిగత ఫలితాన్ని కూడా సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకమైందిగా మార్చిందని ప్రధానమంత్రి అన్నారు. పారుల్ చౌదరీ అంకిత భావం, దృఢ సంకల్పం చూసి దేశ ప్రజలు సంతోషిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే కాలంలో ఆమె అన్ని ప్రయత్నాలు ఫలప్రదం కావాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘ఆసియా క్రీడల్లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ పోటీలో పారుల్ చౌదరీ అద్భుత ఆటతీరును కనబరిచి, కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. పోడియమ్ వద్దకు చేరుకోవడమే కాకుండా, సర్వశ్రేష్ఠ వ్యక్తిగత ఫలితాన్ని కూడా నమోదు చేయడం ఈ విజయానికి అదనపు విశిష్టతను జోడించింది. ఆమె అంకిత భావం, దృఢ సంకల్పం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తూ, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు’’ అని తెలిపింది.


(రిలీజ్ ఐడి: 2315979) సందర్శకుల సూచీ సంఖ్య : : 8