ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో పురుషుల డెకాథ్లాన్ పోటీ కాంస్య పతక విజేత తేజస్విన్ శంకర్‌‌కు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 27 SEP 2026 9:26PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో పురుషుల డెకాథ్లాన్ పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన తేజస్విన్ శంకర్‌ను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
రెండు రోజుల పాటు కొనసాగే ఇంత కఠినమైన ఈవెంట్‌లో పోటీలో కుదురుకోవాలంటే గొప్ప సామర్థ్యం, సహనశక్తి, దృఢ సంకల్పం అవసరమని ప్రధానమంత్రి అన్నారు. ఈ మూడు గుణాలకు అద్భుత ఉదాహరణగా తేజస్విన్ శంకర్ నిలుస్తూ, కర్తవ్యాన్ని పక్కాగా ముగించారని, ఇది ఒక ప్రశంసనీయ విజయమని శ్రీ మోదీ అన్నారు. భవిష్యత్తులో ఆయన అన్ని ప్రయత్నాల్లో రాణించాలంటూ, ప్రధానమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘ఆసియా క్రీడల్లో పురుషుల డెకాథ్లాన్ పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన తేజస్విన్ శంకర్‌‌కు అభినందనలు. రెండు రోజుల పాటు కొనసాగే ఇంత కఠినమైన ఈవెంట్‌లో పాలుపంచుకోవాలంటే గొప్ప సామర్థ్యాన్ని, సహనశక్తిని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి. ఈ మూడు గుణాలను ఆయన గొప్పగా చాటుకుంటూ కర్తవ్యాన్ని అద్భుతంగా నిభాయించారు. ఇది ప్రశంసనీయ విజయం. రాబోయే కాలంలో తేజస్విన్ శంకర్ ప్రతి ప్రయత్నంలో తప్పక రాణించాలని కోరుకుంటూ, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను: ప్రధానమంత్రి’’ అని పేర్కొంది.


(రిలీజ్ ఐడి: 2315975) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam