ప్రధాన మంత్రి కార్యాలయం
మానవ జీవిత లక్ష్యాలు నాలుగింటి సాధనకు మంచి ఆరోగ్యం ప్రధానమంటున్న సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 10:25AM by PIB Hyderabad
ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు జీవిత పరమార్థాలను నెరవేర్చుకోవడానికి మానవులకు మంచి ఆరోగ్యం ప్రధానమని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘సుఖోపవిష్టాస్తే తత్ర పుణ్యాం చక్రుః కథామిమామ్
ధర్మార్థకామమోక్షాణామారోగ్యం మూలముత్తమమ్’’ అని పేర్కొన్నారు.
మనుషులు వారి జీవిత పరమార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలనేవి సాధించడానికి ప్రధానాధారం ఉత్తమ ఆరోగ్యమనే పవిత్ర సందేశాన్ని మహా మునులు శాంత భావనతో ప్రబోధించారని ఈ సుభాషితం సూచిస్తోంది.
(రిలీజ్ ఐడి: 2315974)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam