సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
65వ జాతీయ కళా ప్రదర్శనోత్సవాల సందర్భంగా 20 పురస్కారాలను ప్రకటించిన లలిత కళా అకాడమీ
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2026 7:03PM by PIB Hyderabad
దేశంలో సమకాలీన దృశ్య కళల సంబంధిత అత్యంత ప్రతిష్టాత్మక వార్షిక కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర లలిత కళా అకాడమీ 65వ జాతీయ కళా ప్రదర్శనోత్సవాలను నిర్వహిస్తోంది. కళాకారుల సృజనాత్మకత ప్రతిభా ప్రదర్శనకు, తద్వారా దేశంలోని వైవిధ్యభరిత, నిరంతర పరిణామాత్మక దృశ్య కళలతో ప్రేక్షకులు మమేకమయ్యేందుకు ఇదొక జాతీయ వేదికగా ఉపయోగపడుతోంది.
ఈ జాతీయ కళా ప్రదర్శనోత్సవానికి దేశవ్యాప్త కళాకారుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఈ మేరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2,495 మంది కళాకారులు అకాడమీకి 6,175 కళాకృతులను పంపారు. వీటిపై నిశిత పరిశీలన ప్రక్రియ అనంతరం తొలి అంచె నిర్ణేతల సంఘం 270 కళాఖండాలను ప్రదర్శన కోసం ఎంపిక చేసింది.
ఇలా ఎంపికైన కళాఖండాలు- చిత్రలేఖనం, శిల్పం, ముద్రణ, రేఖాచిత్రాలు, మిశ్రమ వస్తువులు వంటి వివిధ పద్ధతులతోపాటు విభిన్న సామగ్రి, సాంకేతికతల వినియోగాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సమకాలీన భారతీయ కళాత్మక వ్యక్తీకరణ వైభవాన్ని, కొత్త సామగ్రితోపాటు ఆలోచనలు, రూపాలతో కళాకారులు నిరంతరం మమేకం కావడాన్ని ఈ ప్రదర్శన కళ్లకు కట్టింది. అటుపైన రెండో అంచె నిర్ణేతల సంఘం వీటి నుంచి 20 కళాకృతులను జాతీయ లలిత కళా పురస్కారాల కోసం ఎంపిక చేసింది:
పురస్కార విజేతలు వీరే:
|
వ.సం.
|
కళాకారులు
|
అవార్డు కళాకృతి
|
మాధ్యమం
|
విభాగం
|
|
1
|
చంద్ర శేఖర్ సెయిన్
|
మై ఎంటైర్ వరల్డ్-1
|
టెర్రకోట
|
శిల్పం
|
|
2
|
గోపాల్ చంద్ర నస్కర్
|
ది ట్యూన్ ఆఫ్ ది శ్రీమద్భగవద్గీత
|
కాన్వాస్పై అక్రిలిక్
|
పెయింటింగ్
|
|
3
|
కిషోర్ కుమార్ నర్ఖడివాలా
|
పర్యావరణం
|
తైలవర్ణ చిత్రం
|
పెయింటింగ్
|
|
4
|
మృణాల్ డే
|
నిరాశాజనక ఆవాసం
|
కాన్వాస్పై అక్రిలిక్
|
పెయింటింగ్
|
|
5
|
నిధి చోప్రా
|
విస్పష్ట కలలు
|
సిరామిక్
|
శిల్పం
|
|
6
|
నిమై సింగ్ సరుంగ్బామ్
|
ముద్ర-I
|
టేకు కొయ్య
|
శిల్పం
|
|
7
|
పంకజ్ కుమార్ శర్మ
|
దివ్య యాత్రికుడు-II
|
ప్యానెల్ వర్క్స్
|
డ్రాయింగ్
|
|
8
|
పూజా రాజ్ పుత్
|
ప్రకృతి శోషణ్
|
తెల్ల పాలరాయి
|
శిల్పం
|
|
9
|
ప్రవీణ్ కుమార్
|
గోడల జ్ఞాపకాలు
|
మిశ్రమ మాధ్యమం
|
పెయింటింగ్
|
|
10
|
ప్రీతమ్ మధుకర్ దేవుస్కర్
|
కాలం-నగరం
|
ఎచింగ్
|
ప్రింట్ మేకింగ్
|
|
11
|
రాజేంద్ర ప్రసాద్
|
బుద్ధునితో సుజాత
|
జలవర్ణ
|
పెయింటింగ్
|
|
12
|
రమేష్ విఠల్ తోరత్
|
శీర్షిక రహితం-II
|
కాన్వాస్‌పై తైలవర్ణ చిత్రం
|
పెయింటింగ్
|
|
13
|
రవిరామ్ రామకృష్ణన్
|
మహిళా జాలరి
|
రాగి, ఆక్సీకరణ, వెల్డింగ్
|
శిల్పం
|
|
14
|
సంజయ్ కుమార్
|
జ్ఞాపకాలు సస్మరణ-7
|
మిశ్రమ మాధ్యమం
|
పెయింటింగ్
|
|
15
|
సంజయ్ కుమార్ సహాని
|
యవ్వనం
|
కాన్వాస్‌పై తైలవర్ణ చిత్రం
|
పెయింటింగ్
|
|
16
|
సంజీబ్ కుమార్ గోగోయ్
|
ఆకార్-నిరంకార్ -II
|
కాన్వాస్‌పై అక్రిలిక్-తైలవర్ణ చిత్రం
|
పెయింటింగ్
|
|
17
|
శాంటా దేబ్
|
ఆకర్షణీయ సారళ్యం
|
సిరామిక్
|
శిల్పం
|
|
18
|
సిద్ధార్థ్ షాజీరావ్ షింగాడే
|
వృక్షాలు
|
మిశ్రమ మాధ్యమం
|
పెయింటింగ్
|
|
19
|
ఉషారంజన్ మండల్
|
రద్దీ నగర చక్రం
|
మిశ్రమ మాధ్యమం
|
ఇతర మాధ్యమం
|
|
20
|
విజేంద్ర శర్మ
|
జీవితం 2025
|
కాన్వాస్‌పై తైలవర్ణ చిత్రం
|
పెయింటింగ్
|
కళాత్మకతను గుర్తించే వేదికగానే కాకుండా భారతీయ సృజనార్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఈ 65వ జాతీయ కళా ప్రదర్శన దోహదం చేస్తుంది. కళాకారులు, వీక్షకులు, సేకరణకర్తలు, సంస్థలను ఒకే వేదికపైకి తేవడం ద్వారా కళాకారులకు మరింత గుర్తింపు సహా వృత్తిపరమైన అవకాశాలు కల్పిస్తుంది. కళాకృతుల ప్రదర్శన, విక్రయం ద్వారా వారు ప్రత్యక్ష ఆర్థిక లబ్ధి పొందుతారు. తద్వారా వారి కళాతృష్ణకు చేయూతనిస్తూ, దృశ్య కళలకు మరింత సుస్థిర వ్యవస్థ ఏర్పడటంలో తోడ్పడుతుంది.
ప్రసిద్ధులను మాత్రమేగాక వర్ధమాన కళాకారులను కూడా ఈ ప్రదర్శన ఎంతగానో ప్రోత్సహిస్తోంది. ప్రయోగాత్మకతకు తోడ్పాటు, విభిన్న కళాత్మక ప్రతిభకు జాతీయ వేదికను సమకూర్చడంలో జాతీయ లలిత కళా అకాడమీ నిరంతర నిబద్ధతను కూడా ప్రతిబింబించింది. దీనికితోడు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కళాకారులు ఇందులో పాలుపంచుకోవడం జాతీయ కళా ప్రదర్శన విశిష్ట స్వభావాన్ని ప్రస్ఫుటం చేసింది.
ఈ 65వ జాతీయ కళా ప్రదర్శనోత్సవం కోసం కళాఖండాల ఎంపికలో నిర్ణేతల సంఘం అమూల్య సహకారానికి లలిత కళా అకాడమీ కృతజ్ఞతలు తెలుపుతూ, పురస్కార విజేతలు సహా కళాకారులందరినీ అభినందించింది.
***
(రిలీజ్ ఐడి: 2315823)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9