ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల స్క్వాష్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన జ్యోష్నా చినప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్‌లను అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 SEP 2026 7:43PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో స్క్వాష్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన జ్యోష్నా చినప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్‌ల అసాధారణ నైపుణ్యాన్ని, పట్టుదలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.

జోష్నా 2010 నుంచి వరుసగా ఆసియా క్రీడల్లో పాల్గొని, ప్రతి ఎడిషన్‌లో పతకం సాధించిన క్రీడాకారిణిగా ఘనత సాధించారు. ఆమె నిలకడ నిజంగా అద్భుతమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇద్దరు అథ్లెట్లకు భవిష్యత్తు కోసం శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

ఆసియా క్రీడల స్క్వాష్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలుచుకున్న జ్యోష్నా చినప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్‌లకు అభినందనలు. వారి నైపుణ్యం, పట్టుదల అసాధారణమైనవి.

జ్యోష్నా 2010 నుంచి వరుసగా ఆసియా క్రీడల్లో పాల్గొని, ప్రతి ఎడిషన్‌లో పతకం సాధించిన క్రీడాకారిణిగా ఘనత సాధించారు. ఆమె నిలకడ నిజంగా అద్భుతమైనది.

ఈ ఇద్దరు అథ్లెట్లకు భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు. 


(రిలీజ్ ఐడి: 2315811) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam