ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల స్వర్ణాన్ని నిలబెట్టుకున్న పురుషుల కబడ్డీ జట్టును అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 SEP 2026 7:51PM by PIB Hyderabad

ఆసియా క్రీడల స్వర్ణాన్ని నిలబెట్టుకున్న పురుషుల కబడ్డీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. వారు మరోసారి ఛాంపియన్‌లుగా నిలిచారని కొనియాడారు.

వారి పట్టుదల దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారి విజయం రాబోయే అనేక మంది క్రీడాకారులకూ స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. జట్టు మొత్తానికి వారి భవిష్యత్ ప్రయత్నాల కోసం శుభాకాంక్షలు తెలిపారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

"మరోసారి ఛాంపియన్‌లుగా నిలిచారు!

ఆసియా క్రీడల స్వర్ణాన్ని నిలబెట్టుకున్న మన పురుషుల కబడ్డీ జట్టుకు అభినందనలు. వారి పట్టుదల దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టింది. వారి విజయం రాబోయే అనేక మంది క్రీడాకారులకూ స్ఫూర్తినిస్తుంది.

జట్టు మొత్తానికి వారి భవిష్యత్ ప్రయత్నాల కోసం శుభాకాంక్షలు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2315402) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Malayalam