ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో మహిళల 10,000మీ విభాగంలో కాంస్యం సాధించిన సీమాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2026 7:43PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో మహిళల 10,000మీ. విభాగంలో కాంస్య పతకం సాధించిన సీమాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సాధించిన విజయం గర్వకారణమని అన్నారు.
ఆమె కనబరచిన అత్యుత్తమ ప్రతిభ వలనే ఎన్నో ఏళ్ల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు పతకం లభించిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ అద్భుతమైన విజయం వెనక పట్టుదల, క్రమశిక్షణ, ఎన్నో ఏళ్ల శ్రమ ఉన్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
"ఆసియా క్రీడల్లో మహిళల 10,000మీ విభాగంలో కాంస్య పతకం సాధించిన సీమా పట్ల గర్వంగా ఉంది. ఆమెకు శుభాకాంక్షలు.
ఆమె కనబరచిన అత్యుత్తమ ప్రతిభ వలనే ఎన్నో ఏళ్ల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు పతకం లభించింది. ఈ అద్భుతమైన విజయం వెనక పట్టుదల, క్రమశిక్షణ, ఎన్నో ఏళ్ల శ్రమ ఉన్నాయి.
భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా: పీఎం శ్రీ నరేంద్ర మోదీ"
(రిలీజ్ ఐడి: 2314722)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam