రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కాన్పూర్ సెంట్రల్, ఆనంద్ విహార్ (టీ) మధ్య కొత్త రోజువారీ రైలు సర్వీసును ప్రారంభించేందుకు భారతీయ రైల్వే ఆమోదం

కాన్పూర్, ఢిల్లీ మధ్య ప్రయాణ సదుపాయాన్ని మరింత మెరుగుపరుస్తూ ప్రతిరోజూ రాత్రివేళ నడిచే రైలు సర్వీసు

ఎటావా, అలీగఢ్, ఘజియాబాద్, ఇతర ముఖ్యమైన స్టేషన్ల మీదుగా రాకపోకలు

నాడు పోస్టు చేయడమైనది: 24 SEP 2026 3:17PM by PIB Hyderabad

కాన్పూర్ సెంట్రల్, ఆనంద్ విహార్ (టీ) మధ్య కొత్తగా రోజువారీ రైలు సర్వీసును ప్రారంభించడానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. దీనివల్ల కాన్పూర్, ఢిల్లీ మధ్య రాత్రి వేళ రైలు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

రైలు నెం. 14153/14154 కాన్పూర్ సెంట్రల్ నుంచి ఆనంద్ విహర్ (టీ)- కాన్పూర్ సెంట్రల్ మెయిల్‌గా కొత్త సర్వీసు నడుస్తుంది.

కాన్పూర్, ఢిల్లీ మధ్య సౌకర్యవంతమైన రాత్రి ప్రయాణం

రైలు నెం. 14153  కాన్పూర్ సెంట్రల్ – ఆనంద్ విహార్ (టీ) వెళ్లే మెయిల్... కాన్పూర్ సెంట్రల్ వద్ద 20:40 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 04:50 గంటలకు ఆనంద్ విహార్ (టీ) చేరుకుంటుంది.

అలాగే రైలు నెం. 14154 ఆనంద్ విహార్ (టీ)--కాన్పూర్ సెంట్రల్ మెయిల్... ఆనంద్ విహార్ (టీ) వద్ద 23:25 గంటలకు ప్రారంభమవుతుంది. కాన్పూర్ సెంట్రల్‌కు 07:25 గంటలకు చేరుకుంటుంది. రెండు వైపులా కలిపి ప్రయాణ దూరం 428 కి.మీ. కాన్పూర్ సెంట్రల్ నుంచి ఆనంద్ విహార్ (టీ) వరకు ప్రయాణ సమయం 8 గంటల 10 నిముషాలు. తిరుగు ప్రయాణ సమయం 8 గంటలు.

ఎనిమిది వాణిజ్య స్టాపులతో డైలీ సర్వీసు

కొత్త రైలు దిగువ పేర్కొన్న స్టేషన్లలో ఆగుతుంది:

  • ఫఫుండ్

  • ఎటావా

  • టుండ్లా

  • హాథ్రస్

  • ఆలీగఢ్

  • ఖుర్జా

  • దాద్రి

  • ఘజియాబాద్

ప్రతిరోజూ నడిచే ఈ సర్వీసు కాన్పూర్, జాతీయ రాజధాని ప్రాంతం మధ్య ప్రయాణికులకు అదనపు రైలు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తుంది. రెండు వైపులా రాత్రి వేళల్లో అనుకూలమైన సమయాల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

ప్రయాణికుల అనుసంధానాన్ని బలోపేతం చేయడం 

కొత్తగా ప్రారంభించిన రోజువారీ మెయిల్ సర్వీసుతో కాన్పూర్ సెంట్రల్, ఆనంద్ విహార్ (టీ) మధ్య రైలు అనుసంధానం మరింత బలపడుతుంది. ప్రయాణికులకు రాత్రివేళ ప్రయాణించే సదుపాయం కలగడంతో పాటు, మార్గమధ్యంలో ముఖ్యమైన స్టేషన్లకు కూడా ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

ఈ సర్వీసుతో కాన్పూర్, ఎటావా, అలీగఢ్, ఘజియాబాద్, ఢిల్లీ ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ముఖ్యమైన ఈ రైలు మార్గంలో ప్రయాణికుల రాకపోకలకు ఈ రైలు ఎంతగానో తోడ్పడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2314465) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Kannada