ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నవా షెవా ఓడరేవులో రూ. 3 కోట్ల విలువైన 10,000 కిలోల బాణసంచా స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ

సీసాల ముసుగులో రహస్యంగా బాణసంచా తరలించేందుకు యత్నం

కీలక ముఠా సభ్యుని అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 8:07PM by PIB Hyderabad

విశ్వసనీయ సమాచారంతో డీఆర్ఐ అధికారులు నవా షెవా ఓడరేవులో నిర్వహించిన సోదాల్లో అక్రమంగా దిగుమతి అవుతున్న సరుకును గుర్తించారు. బాణసంచా ఉందనే అనుమానంతో తనిఖీ చేయగా... "సీసాలు, వాల్‌పేపర్లు"గా పేర్కొన్న సరుకు ముసుగులో రహస్యంగా దాచిన బాణసంచాను వారు గుర్తించారు.

 

పూర్తిస్థాయి తనిఖీల్లో సుమారు రూ.3 కోట్ల మార్కెట్ విలువ గల 19,800 బాణసంచా సామాగ్రిని (వీటిని 288 గాట్లింగ్ అంటారు) గుర్తించారు. వీటి బరువు దాదాపు 10,000 కేజీలు. కంటైనర్ ముందు భాగంలోని మొదటి మూడు వరుసల్లో మాత్రమే వారు చెప్పిన వస్తువులు (సీసాలు) ఉండగా, మిగిలిన కంటైనర్ మొత్తం బాణసంచాతో నింపేసారు. ఈ బాణసంచాతో పాటు, దానిని దాచడానికి వాడిన మిగిలిన వస్తువులనూ కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

విదేశీ వాణిజ్య విధానం ప్రకారం బాణసంచాను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు ఉన్నాయి. దీని కోసం డీజీఎఫ్‌టీ నుంచి సరైన అనుమతి పత్రం, ఎక్స్‌ప్లోజివ్స్ నియమాలు-2008 ప్రకారం 'పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్' (పీఈఎస్‌వో) నుంచి తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా, అధికారుల కళ్లు గప్పి రహస్యంగా ఆ సరుకును బయటకు తీసుకురావడానికి ప్రయత్నించిన ఆ ముఠాలోని కీలక సభ్యుడిని కస్టమ్స్ చట్టం-1962 కింద పోలీసులు అరెస్టు చేశారు.

 

వాణిజ్య రవాణా మార్గాల ద్వారా తప్పుడు సమాచారంతో, రహస్యంగా దిగుమతి చేసుకునే నిషేధిత సరుకులను గుర్తించడంలో డీఆర్ఐ నిరంతర కృషిని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించింది.

***


(రిలీజ్ ఐడి: 2314203) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi