ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అస్సాంలో వన్యప్రాణుల అక్రమ రవాణా నిరోధక చర్యల్లో భాగంగా 86 టోకే గెక్కోలను (అరుదైన బల్లులు) స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ - ఇద్దరి అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 8:13PM by PIB Hyderabad

అక్రమ వన్యప్రాణుల వ్యాపారానికి సంబంధించి అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, డీఆర్ఐ అధికారులు నిన్న అస్సాంలోని మారియానిలో గల బందర్ చాలియా గావ్ మైదానం వద్ద ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

 

ఈ సోదాల్లో భాగంగా... అంతరించిపోతున్న వన్యప్రాణి జాతికి చెందిన 86 సజీవ 'టోకే గెక్కో' బల్లులను వారి నుంచి స్వాధీనం చేసుకుని, వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972 నిబంధనల ప్రకారం వాటిని జప్తు చేశారు.

 

టోకే గెక్కో... వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972లోని షెడ్యూల్-I, అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే సీఐటీఈఎస్ అనుబంధం-IIల పరిధిలోకి వస్తుంది. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న సజీవ గెక్కోలను... వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972లోని సంబంధిత నిబంధనల ప్రకారం తదుపరి చర్యల కోసం అస్సాంలోని మారియాని రేంజ్ అటవీ కార్యాలయానికి అప్పగించారు.

 

అంతర్జాతీయ నల్లబజారులో అరుదైన వింత పెంపుడు జంతువులుగా పెంచుకోవడం కోసం, కొన్ని మూఢనమ్మకాల ప్రకారం ఔషధ గుణాలు ఉన్నాయనే భ్రమలతో వాటిని ఉపయోగించడం కోసం అక్రమ రవాణాకు గురవుతున్న వన్యప్రాణుల రక్షణ, అక్రమ రవాణా నెట్‌వర్క్‌ల నిర్మూలనలో 'డీఆర్ఐ' నిరంతర కృషిని ఈ ఆపరేషన్ స్పష్టం చేస్తోంది.

****


(రిలీజ్ ఐడి: 2314202) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , Marathi , हिन्दी