ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజతం సాధించిన మీరాబాయి చానుకు ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 23 SEP 2026 12:47PM by PIB Hyderabad

మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజతం సాధించిన మీరాబాయి చానుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలియజేశారు.

ఆమె దృఢసంకల్పం, నిలకడ దేశాన్ని దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ప్రధాని తెలియజేశారు. ఆమెను చూసి భారత్ గర్విస్తోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:

‘‘మీరాబాయి చానుకు రజతం

మహిళల 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పతకం గెలుచుకున్న ఆమెకు అభినందనలు! ఆమె దృఢసంకల్పం, నిలకడ దేశానికి స్ఫూర్తినందిస్తున్నాయి. ఆమెను చూసి భారత్ గర్విస్తోంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.’’ 

 

****


(రిలీజ్ ఐడి: 2313862) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam