ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచిన షూటర్లు రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, హిమాన్షు ధిల్లాన్, పార్థ్ రాకేష్ మానేలను అభినందించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 7:22PM by PIB Hyderabad
ఆసియా క్రీడలు-2026 పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించిన రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, హిమాన్షు ధిల్లాన్, పార్థ్ రాకేష్ మానేలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. వారి ఏకాగ్రత, స్థిరత్వం, సమష్టి కృషి దేశానికి గర్వకారణంగా నిలిచాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
ఆసియా క్రీడల పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించిన రుద్రాంక్ష్ బాలసాహెబ్ పాటిల్, హిమాన్షు ధిల్లాన్, పార్థ్ రాకేష్ మానేలకు అభినందనలు.
అద్భుతమైన సమష్టి స్కోరుతో కూడిన వారి ప్రదర్శన నిజంగా ప్రశంసనీయం. వారి ఏకాగ్రత, స్థిరత్వం, సమష్టి కృషి దేశానికి గర్వకారణంగా నిలిచాయి. వారి భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు.
(రిలీజ్ ఐడి: 2313252)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3