ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 SEP 2026 7:28PM by PIB Hyderabad

ఐచి - నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలిపారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి క్రీడాకారుడు ఎంతో కష్టపడి శ్రమించారని, వారిని చూసి యావత్‌ దేశం గర్విస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఐచి - నగోయాలో ఆసియా క్రీడలు ప్రారంభమైన సందర్భంగా ఆ క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి క్రీడాకారుడు ఎంతో కష్టపడి శ్రమించడంతో పాటు, అద్భుతమైన అంకితభావం, పట్టుదలతో సాధన చేశారు. వారిని చూసి యావత్‌ భారత్‌ గర్విస్తోంది. వారు  అత్యుత్తమ ప్రదర్శన కనబరచి, క్రీడల్లో రాణించి, విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు. 

 

***


(రిలీజ్ ఐడి: 2312825) సందర్శకుల సూచీ సంఖ్య : : 9