సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ తదుపరి వృద్ధి రంగంగా ఆవిర్భవిస్తున్న సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ… యువ భారతీయులకు నూతన అవకాశాల కల్పన: డాక్టర్ ఎల్. మురుగన్

ఏవీజీసీ రంగానికి 2030 నాటికి సుమారు 20 లక్షల మంది నిపుణులు అవసరమవుతారని అంచనా… దీని ద్వారా యువతకు నూతన అవకాశాలు

భవిష్యత్తుకు సరిపోయే నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్, ఏవీజీసీ క్రియేటర్ ల్యాబ్స్‌కు ప్రభుత్వ మద్దతు

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2026 2:39PM by PIB Hyderabad

"చట్టం, విధానాలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ" అంశంపై ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాంక్లేవ్ ప్రారంభోత్సవానికి సమాచార, ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు.

యువ భాగస్వామ్యులను ఉద్దేశించి డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ... ఆలోచనలు, ఊహాశక్తి, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఆధారంగా భారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. చలన చిత్రాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, ప్రచురణ, ప్రకటనలు, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉపాధి, వ్యవస్థాపకతకు నూతన అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు.

డాక్టర్ మురుగన్ వెల్లడించిన వివరాల ప్రకారం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ... ప్రపంచ జీడీపీకి 3.1 శాతం, ప్రపంచ ఉపాధిలో 6.2 శాతం దోహదపడుతోంది. ఇప్పటికే దాదాపు 57 లక్షల మంది భారతీయులు సాంస్కృతిక, సృజనాత్మక రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. భారతదేశ మీడియా, వినోద రంగం విలువ రూ. 2.5 లక్షల కోట్లుగా ఉంది.

యువ భారతీయులకున్న అవకాశాలను తెలియజేస్తూ... ఒక్క ఏవీజీసీ రంగానికే 2030 నాటికి దాదాపు 20 లక్షల మంది నైపుణ్యం గల నిపుణులు అవసరమవుతారని ఆయన తెలిపారు. యువతను ఈ సరికొత్త అవకాశాలకు సిద్ధం చేసేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ఏర్పాటుకు, 15,000 పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం మద్దతిచ్చింది.

సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తగిన చట్టపరమైన, విధానపరమైన ప్రణాళిక మద్దతు ఉండాలని డాక్టర్ మురుగన్ స్పష్టం చేశారు. ఇందులో కాపీరైట్ రక్షణ, సృష్టికర్తలకు సరైన పారితోషికం, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ వినియోగం వంటివి భాగంగా ఉండాలని చెప్పారు. గౌరవంగా, ఆలోచనతో, ఆధారాలతో ప్రస్తుత వ్యవస్థలను, సంప్రదాయాలను ప్రశ్నించాలని యువతకు పిలుపునిచ్చారు. వికసిత్ భారత్-2047 నిర్మాణంలో యువత ఆలోచనలు, నైపుణ్యాలతో తోడ్పాటును అందించాలని కోరారు.

 

***


(రిలీజ్ ఐడి: 2312092) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Kannada