ప్రధాన మంత్రి కార్యాలయం
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ ఎం. వెంకయ్యనాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 10:36PM by PIB Hyderabad
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ ఎం. వెంకయ్యనాయుడుకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, నైపుణ్యాలు, సమష్టి కృషే సుభిక్షంగా వర్థిల్లే భారతదేశాన్ని నిర్మించే ప్రయాణానికి బలమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
"నాకు శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య గారికి కృతజ్ఞతలు.
140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, నైపుణ్యాలు, సమష్టి కృషే సుభిక్షంగా వర్థిల్లే భారతదేశాన్ని నిర్మించే ప్రయాణానికి బలం"
(రిలీజ్ ఐడి: 2311954)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5