రైల్వే మంత్రిత్వ శాఖ
ముకుత్‌బన్ (ఆదిలాబాద్), గడ్చందూర్ మధ్య రూ. 493 కోట్లతో 38.21 కి.మీ.ల కొత్త రైల్వే లైనుకు భారతీయ రైల్వే ఆమోదం
కొత్త రైల్వే లైను దూరాన్ని తగ్గిస్తుంది, సరకు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది, పారిశ్రామిక, మైనింగ్ అభివృద్ధికి తోడ్పడుతుంది
నాడు పోస్టు చేయడమైనది:
18 SEP 2026 11:23AM by PIB Hyderabad
ప్రాంతీయ రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేసే, ప్రయాణికులను, సరకులను వేగంగా, సమర్థంగా రవాణా చేసే దిశగా రూ.493 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే మార్గం నిర్మాణానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముకుత్‌బన్ (ఆదిలాబాద్), గడ్చందూర్ మధ్య రూ.38.21 కి.మీ.ల మేర ఈ నూతన రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.
పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలకు రవాణా అనుసంధానం బలోపేతం
యవత్మల్ జిల్లాలోని ముకుత్‌బన్, చంద్రాపూర్ జిల్లాలోని గడ్చందూర్ ముఖ్యమైన పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ అనేక సిమెంట్ ప్లాంట్లు, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనులు, సున్నపురాయి గనులు ఉన్నాయి. ఈ పారిశ్రామిక క్లస్టర్లకు రవాణా అనుసంధానాన్ని కొత్త రైల్వే లైను బలోపేతం చేస్తుంది. సరకు రవాణాను మరింత సులభతరం చేస్తుంది.
ఇప్పటికే ఉన్న మార్గంలో సరకు రవాణాను పెంపొందించే, రద్దీని తగ్గించే తక్కువ దూరం ఉన్న మార్గం
ప్రయాణ దూరాన్ని, రవాణా సమయాన్ని, ఖర్చులను తగ్గించే తక్కువ దూరంతో కూడిన, మరింత సమర్థమైన మార్గాన్ని కొత్త రైల్వే లైను అందిస్తుంది. ప్రస్తుతమున్న వార్ధ–మానిక్‌గఢ్ సెక్షన్లో రద్దీని తగ్గించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. సరకు రవాణా సజావుగా సాగేందుకు దోహదపడుతుంది.
సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం, ఈ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఏడాదికి 6.08 మిలియన్ టన్నుల సరకు రవాణాతో పాటు ఇరువైపులా రోజుకు రెండు ‘మెము’ రైళ్లు నడిపేందుకు తోడ్పడుతుందని అంచనా. బొగ్గు, కోక్, సిమెంట్, స్పాంజ్ ఐరన్, లోహ వ్యర్థాలు, ఇనుము–ఉక్కు, ఎరువులు, ఆహారధాన్యాలతో సహా ఇతర వస్తువులు సరకు రవాణాలో ఉంటాయని భావిస్తున్నారు.
మజ్రీ–నాందేడ్ మార్గానికి, ఇతర ప్రధాన గమ్యస్థానాలకు ప్రత్యక్ష అనుసంధానం
బొగ్గు, సిమెంట్ క్లస్టర్లకు మజ్రీ–నాందేడ్ మార్గానికి మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని ఈ కొత్త లైన్ కల్పిస్తుంది. దీనివల్ల మహారాష్ట్ర, కర్ణాటకలోని జల్నా, పర్భాని, ఛత్రపతి శంభాజీనగర్, ఇతర గమ్యస్థానాలకు బొగ్గు, సిమెంటు, ఆర్ఎంఎస్‌పీ రవాణా దూరం తగ్గుతుంది.
రద్దీగా ఉండే బల్హార్ష–నాగపూర్ మార్గంపై ఆధారపడాన్ని తగ్గిస్తుంది
రద్దీగా ఉండే బల్హార్ష–నాగపూర్ హై–డెన్సిటీ నెట్‌వర్క్ (హెచ్‌డీఎన్) మార్గంపై ఆధారపడటాన్ని ఈ ప్రాజెక్టు తగ్గిస్తుంది. అలాగే యవత్మల్, చంద్రాపూర్ జిల్లాల్లో సాపేక్షంగా తక్కువ అనుసంధానం ఉన్న ప్రాంతాలకు రైలు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. ఈ మార్గం మెరుగైన రైలు మౌలిక సదుపాయాల ద్వారా ఈ ప్రాంతంలో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
ప్రాంతీయ రైల్వే మౌలిక వసతుల బలోపేతం
ఈ కొత్త రైలు మార్గం ప్రాంతీయ రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది. నిత్యావసర వస్తువుల రవాణాను సులభతరం చేస్తుంది. పెరుగుతున్న సరకు రవాణా, ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా అదనపు రైలు కారిడార్‌ను అందిస్తుంది. ఇప్పటికే ఉన్న రైల్వే నెట్‌వర్కును మరింత సమర్థంగా ఉపయోగించుకోవడానికి, పారిశ్రామిక, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అంచనా.
***
(రిలీజ్ ఐడి: 2311945)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10