ప్రధాన మంత్రి కార్యాలయం
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాకు ప్రధానమంత్రి ధన్యవాదాలు
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 8:06PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవనీయ లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు. కోట్లాది దేశవాసుల ప్రతిభ, కృషి ఫలితంగానే ప్రగతి సాధనలో దేశం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నదని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని మరింత శక్తిమంతం, సుసంపన్నం, స్వయంసమృద్ధం చేయడానికి కట్టుబడి ఉన్నామని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“గౌరవనీయ లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారూ.. నా జన్మదినం సందర్భంగా ఆప్యాయతతో కూడిన మీ సందేశానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆలోచనలు చాలా విలువైనవేగాక నాకెంతో ప్రేరణనిస్తాయి. నేడు, కోట్లాది ప్రజల ప్రతిభ, కృషి ఫలితంగానే ప్రగతి సాధనలో దేశం కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. వారి మద్దతు, ఆశీస్సులతో దేశాన్ని మరింత శక్తిమంతం, సుసంపన్నం, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడానికి మేం నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2311774)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11