ప్రధాన మంత్రి కార్యాలయం
ఆధునిక, సాంకేతికత ఆధారిత, వృత్తిపరంగా నిర్వహించే సంస్థగా
భారతీయ తపాలా శాఖ సాధించిన పరివర్తనను వివరిస్తూ రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 5:38PM by PIB Hyderabad
ఆధునిక, సాంకేతికత ఆధారిత, వృత్తిపరంగా నిర్వహించే సంస్థగా భారతీయ తపాలా శాఖ రూపాంతరం చెందిన విధానాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. రవాణా, ఆర్థిక సేవలు, పౌర కేంద్రీకృత సేవల విభాగాల్లో తపాలాశాఖ తన విస్తృత సేవా పరిధిని డిజిటల్ సామర్థ్యాలతో అనుసంధానిస్తోందని ఈ వ్యాసం పేర్కొంది.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా రాసిన ఈ కథనంలో భారతీయ తపాలా శాఖ ఆధునిక, సాంకేతికత ఆధారిత, వృత్తిపరంగా నిర్వహించే సంస్థగా మారుతున్న తీరును వివరించారు. రవాణా, ఆర్థిక సేవలు, పౌర ఆధారిత సేవల విభాగంలో భారతీయ తపాలా శాఖ తన విస్తృతమైన వ్యవస్థను డిజిటల్ సామర్థ్యాలతో మేళవిస్తోందని ఆయన వివరించారు. సరిగ్గా అదే సమయంలో ‘డాక్ సేవా, జన్ సేవా’ స్ఫూర్తితో విశ్వసనీయ ప్రజా సేవా పాత్రను ఇది నిరంతరం నిలబెట్టుకుంటోంది’’
***
(రిలీజ్ ఐడి: 2311771)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam