ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత అభివృద్ధి ప్రస్థానంలో నీలి విప్లవం మరో విజయగాథగా నిలుస్తోందని వివరించే వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 2:52PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.  శ్రీ మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి ప్రస్థానంలో ‘నీలి విప్లవం’ మరో విజయగాథగా మారుతోందని శ్రీ సీపీ రాధాకృష్ణన్ తన వ్యాసంలో పేర్కొన్నారు. భారత్ నేడు తన తీర ప్రాంతాలను దాటి సముద్ర వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతోందని ఈ కథనం పేర్కొంది. సుస్థిర మత్స్యరంగం ద్వారా తీర ప్రాంతాల్లోని ప్రజలు, యువత, మహిళలకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని, తద్వారా తీర ప్రాంత భారతదేశ ఆర్థిక జీవనం మరింత బలోపేతమవుతోందని ఆయన తెలిపారు.

సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాసిన ఈ కథనం తప్పక చదవాల్సినది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి ప్రస్థానంలో ‘నీలి విప్లవం’ మరో విజయగాథగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్ నేడు తన తీరప్రాంత సరిహద్దులను దాటి సముద్ర వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. సుస్థిర మత్స్యరంగం తీర ప్రాంతాల్లోని ప్రజలు, యువత, మహిళలకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని, ఇది తీర ప్రాంత భారతదేశ ఆర్థిక జీవనాన్ని కూడా బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు’’.

 
***

(రిలీజ్ ఐడి: 2311429) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Malayalam