ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ద కాలపు సేవాభావం భారతీయ సేవా సంప్రదాయానికి ప్రతిబింబం: ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్


ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ద కాలపు సేవపై డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రచించిన పుస్తకాన్ని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2026 8:43PM by PIB Hyderabad

నేడు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో తెలంగాణ మాజీ గవర్నర్‌పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రచించిన “ఎ సెంచరీ ఆఫ్‌ సర్వీస్‌ -ది ఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ 100 యాక్ట్స్‌ ఆఫ్‌ సేవా” పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ద కాలంగా అందిస్తున్న సేవలుసామాజిక బాధ్యతదేశ నిర్మాణంలో దాని కృషిని ఈ పుస్తకం నమోదు చేసిందని తెలిపారు.

“నేటి వార్త రేపటి చరిత్ర” అని పేర్కొన్న శ్రీ సీపీ రాధాకృష్ణన్‌.. మంచి పనులను నమోదు చేయడం ఎంతో ముఖ్యమనిలేకపోతే అవి ప్రజల జ్ఞాపకం నుంచి కనుమరుగయ్యే అవకాశం ఉందని అన్నారుసేవాభావం నిరంతర సామాజిక సేవగా ఎలా రూపాంతరం చెందిందో ఈ పుస్తకం వివరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

“సేవే ధర్మంఅది ఒక కర్తవ్యం” అనే భావనను ప్రాథమిక ఆదర్శంగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారుపేదలుఅణగారిన వర్గాలుసమాజంలోని వివిధ వర్గాలుకార్మికులుమహిళలుపిల్లలకు ఆర్‌ఎస్‌ఎస్‌ సేవా కార్యక్రమాలు చేరాయని తెలిపారుకోవిడ్‌ 19 మహమ్మారి సమయంలో ఆహారంమందులుఇతర అత్యవసర సహాయాన్ని అందించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ స్వచ్చంద కార్యకర్తలు పోషించిన పాత్రను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పుస్తకంలోని “వ్యక్తిత్వ వికాసం ద్వారా దేశ నిర్మాణం” అనే అంశాన్ని ప్రస్తావిస్తూ.. దేశ నిర్మాణానికి దేశభక్తిక్రమశిక్షణసామాజిక బాధ్యతజాతీయ ఐక్యత ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ద కాలపు సేవలకు సంబంధించిన రికార్డుగా మాత్రమే కాకుండాదేశ సేవా సంప్రదాయంసంస్కృతిజాతీయ చైతన్యాన్ని భవిష్యత్తు తరాలకు ప్రతిబింబించే పత్రంగా కూడా ఈ పుస్తకం నిలుస్తుందని ఆయన అన్నారు.

 

డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు పుస్తక ప్రచురణకు సంబంధించిన ప్రతి ఒక్కరినీ ఉపరాష్ట్రపతి అభినందించారుచరిత్రను నమోదు చేసే ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు భవిష్యత్తులో కొనసాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌ మురుగన్‌పుదుచ్చేరి హోం మంత్రి శ్రీ ఎ నమశ్శివాయండాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2310752) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , हिन्दी , Marathi , Tamil , Malayalam