ప్రధాన మంత్రి కార్యాలయం
నువాఖాయి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
15 SEP 2026 4:01PM by PIB Hyderabad
పవిత్ర నువాఖాయి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన రైతులను, పంటను, ఐకమత్య స్ఫూర్తిని వేడుకగా నిర్వహించే పండగే నువాఖాయి అని శ్రీ మోదీ అన్నారు. సమాజంలో సామరస్య, ఐకమత్య స్ఫూర్తిని ఈ ప్రత్యేక సందర్భం మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
నువాఖాయి జుహార్!
మన రైతులను, పంటను, ఐక్యతా స్ఫూర్తిని వేడుకగా నిర్వహించే పండగ నువాఖాయి శుభాకాంక్షలు.
మన సమాజంలో సామరస్య బంధాలను బలోపేతం చేసి, సంతోషాన్ని, శ్రేయస్సును ఈ ప్రత్యేక సందర్భం తీసుకురావాలని ఆశిస్తున్నా.
(రిలీజ్ ఐడి: 2310517)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam