ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 8:45AM by PIB Hyderabad
ఆసియా కప్ మహిళల క్రికెట్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ పోటీలో జట్టు ఆత్మవిశ్వాసం, నిలకడ, అద్భుత స్ఫూర్తి ఆద్యంతం సంపూర్ణంగా ప్రస్ఫుటమయ్యాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
దేశంలోని లక్షలాది యువతను మరింత స్ఫూర్తితో క్రీడల్లో రాణించడానికి ఈ విజయం ఎంతగానో దోహదం చేయగలదని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“భారత క్రికెట్‌కు ఇదొక మధుర క్షణం! ఆసియా కప్ కైవసం చేసుకున్న మహిళల జట్టుకు నా అభినందనలు. ఈ టోర్నమెంటులో ఆదినుంచీ వారి ఆత్మవిశ్వాసం, నిలకడ, ఎనలేని స్ఫూర్తి పూర్తిస్థాయిలో ప్రదర్శితమయ్యాయి. దేశంలోని లక్షలాది యువత క్రీడలలో మరింత రాణించడానికి ఈ విజయం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2310225)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam