పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లోని కచ్‌లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆవాసాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి
జీఐబీ సాఫ్ట్ రిలీజ్ సెంటర్, సయారా వన్ కవచ్‌ల ప్రారంభం
మడ అడవుల పెంపకం ప్రయత్నాలపై సమీక్ష
నలియా వద్ద పెట్రోలింగ్ వాహనాల ప్రారంభం
సయారా, జఖావ్ వద్ద మొక్కలు నాటిన కేంద్ర మంత్రి
ఎమ్ఐఎస్‌హెచ్‌టీఐ లబ్ధిదారులతో మాట్లాడిన శ్రీ భూపేందర్ యాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 3:31PM by PIB Hyderabad
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు గుజరాత్‌లోని కచ్ జిల్లాలో గల నలియాలో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (జీఐబీ) ఆవాసాన్ని సందర్శించారు. కచ్‌లోని జీఐబీ ఆవాస ప్రాంతమంతటా చేపడుతున్న సమగ్ర పరిరక్షణ, ఆవాస-నిర్వహణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ... జీఐబీకి అత్యంత భద్రత కల్పించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలనూ ఆయన సమీక్షించారు.
గుజరాత్ అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పులు, సైన్స్-టెక్నాలజీ శాఖల కేబినెట్ మంత్రి శ్రీ అర్జున్ మోధ్వాడియా కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ... గుజరాత్ అటవీ శాఖ... వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా... బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సీనియర్ అధికారులు... స్థానికులు... కచ్ ప్రాంతవ్యాప్తంగా నిర్వహిస్తున్న అడవుల పెంపకం, తోటల పెంపకం, తీరప్రాంత జీవనోపాధి కార్యక్రమాల లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా... ఆవాస కేంద్రంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కోసం ఏర్పాటు చేసిన సాఫ్ట్ రిలీజ్ సెంటర్‌ను కేంద్ర మంత్రి శ్రీ యాదవ్ ప్రారంభించారు. వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గుజరాత్ అటవీ శాఖ, ఈ జాతి పరిరక్షణలో నిమగ్నమైన ఇతర భాగస్వాములతో ఆయన సంభాషించారు. 'ఖటాలా సభ'లో ప్రజా ప్రతినిధులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి, ఈ జాతి పరిరక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో వారి నిరంతర మద్దతును కోరారు.
గ్రేట్ ఇండియన్ బన్నీ (జీఐబీ) ఆవాస ప్రాంతంలో క్షేత్రస్థాయిలో సాధించిన గణనీయ పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. హానికరమైన ప్రోసోపిస్ జూలిఫ్లోరాతో నిండిపోయిన సుమారు 11 చదరపు కిలోమీటర్ల గడ్డి భూములను పునరుద్ధరించడం... 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30 కిలోమీటర్ల పొడవునా వేటాడే జంతువుల నుంచి రక్షణ కల్పించే కంచెను ఏర్పాటు చేయడం... వైల్డ్ జీఐబీ ఆడ పక్షులు పెట్టిన ఫలదీకరణ చెందని గుడ్ల స్థానంలో, పరిరక్షణ ప్రజనన కార్యక్రమం నుంచి సేకరించిన ఫలదీకరణ చెందే గుడ్లను ఉంచే మార్గదర్శక 'జంప్-స్టార్ట్' చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇటువంటి రెండో ప్రయత్నం నుంచి పుట్టిన పిల్ల పక్షి... అడవిలో కీలకమైన మొదటి మూడు నెలల దశను దాటి మనుగడ సాగించిందనీ, ఇది గుజరాత్‌లో ఈ జాతి పునరుద్ధరణ దిశగా సాధించిన ఒక కీలక విజయమని అధికారులు శ్రీ యాదవ్‌కు తెలియజేశారు.
ఈ విజయాన్ని సాధించడంలో గుజరాత్ అటవీ శాఖ, వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమన్వయంతో చేసిన కృషిని శ్రీ యాదవ్ అభినందించారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాల కోసం ఏర్పాటు చేసిన 33 కొత్త పెట్రోలింగ్, రెస్క్యూ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ వాహనాలను కచ్ ఫారెస్ట్ సర్కిల్ పరిధిలోని వివిధ విభాగాల్లో అటవీ రక్షణ, అటవీ అభివృద్ధి, వన్యప్రాణుల రక్షణ, క్షేత్రస్థాయి పెట్రోలింగ్, పర్యవేక్షణ, త్వరితగతిన స్పందించే కార్యకలాపాల కోసం వినియోగిస్తారు.
సాయారాలోని హరియాలు గ్రామంలో తోటల పెంపకాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి... సాయారా వన్ కవచ్ కార్యక్రమం, దానికి అనుబంధంగా గల తేనెటీగల పెంపకం యూనిట్ గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆ ప్రదేశంలో మొక్కలు నాటిన ఆయన, సాయారా వన్ కవచ్‌నూ ప్రారంభించారు. తోటల పెంపకం కార్యకలాపాల కోసం దీన్‌దయాల్ పోర్ట్ అథారిటీతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన కార్యక్రమంలోనూ కేంద్ర మంత్రి పాల్గొన్నారు. వన్ కవచ్ ఫోటోబుక్‌నూ విడుదల చేసిన ఆయన... స్థానిక నివాసితులతో ముచ్చటించి, వారికి మొక్కల నారును పంపిణీ చేశారు.
మియావాకి వారి దట్టమైన, బహుళ-పొరల అటవీకరణ పద్ధతిని అనుసరించి 9.46 చదరపు కిలోమీటర్ల స్థలంలో అభివృద్ధి చేసిన సయారా వన్ కవచ్‌లో... కచ్‌లోని ఉప్పునీటి, తక్కువ నీటి పరిస్థితులకు అనువైన 47 స్థానిక జాతులకు చెందిన 10,000కు పైగా మొక్కలు ఉన్నాయి. ఈ నమూనా స్థానిక ఉష్ణోగ్రతలను 1.5–2°C వరకు తగ్గించడం... భూగర్భ జలాల పునరుద్ధరణకు సహాయపడటం... నేల కోతను నివారించడం... పక్షులు, కీటకాలు, చిన్న వన్యప్రాణులకు సహజ ఆవాసాన్ని అందించడంతో పాటు... పర్యావరణ పర్యాటకం, పర్యావరణ విద్య, స్థానిక ఉపాధికీ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అధికారులు శ్రీ యాదవ్‌కు వివరించారు.
జఖావ్‌లో మడ అడవుల నర్సరీని కేంద్ర మంత్రి సందర్శించారు. ప్రక్కనే ఉన్న ప్రదేశంలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన సుమారు 50 మంది సిబ్బంది, 50 మందికి పైగా స్థానిక నివాసితులతో కలిసి మడ మొక్కలను నాటారు. కోరి క్రీక్, సిర్ క్రీక్ ప్రాంతాల్లో మడ అడవుల పెంపకం ప్రయత్నాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శననూ ఆయన వీక్షించారు. సముద్రపు నాచు విత్తన బ్యాంకును సందర్శించి నిపుణులతో సంభాషించారు. సముద్రపు నాచు సాగుదారులు, ఎమ్ఐఎస్‌హెచ్‌టీఐ (తీరప్రాంత ఆవాసాలు - సుస్థిర ఆదాయాల కోసం మడ అడవుల కార్యక్రమం) పథకం లబ్ధిదారులతోనూ కేంద్ర మంత్రి మాట్లాడారు.
***
(రిలీజ్ ఐడి: 2310210)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8