సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖకు అధికార భాషా శ్రేష్ఠతా పురస్కారం

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2026 5:14PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని పరిపాలనా సంస్కరణలుప్రజా ఫిర్యాదుల శాఖకు 2025 - 26 సంవత్సరానికి ‘అధికార భాషా శ్రేష్ఠతా పురస్కారం’ లభించిందిఅధికార భాష అమలులో విశేష కృషినిరంతర అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికార భాషా విభాగం ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

ఈ రోజు హిందీ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నవీ ముంబైలో సిడ్కో ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరిగిన ఆరో అఖిల భారత అధికార భాషా సదస్సులో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్‌ షా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారుపరిపాలనా సంస్కరణలుప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా వర్మ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

పరిపాలనా సంస్కరణలుప్రజా ఫిర్యాదుల శాఖ అధికార భాషా విభాగం నుంచి  2023 -24, 2024  - 25 సంవత్సరాల్లో వరుసగా రెండేళ్ల పాటు అధికార భాషా కీర్తి పురస్కారాన్ని అందుకుంది.

ఈ ఏడాది కూడా అధికార భాష అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచి ప్రథమ స్థానాన్ని సాధించింది.

నిబంధనల ప్రకారం ఒక మంత్రిత్వ శాఖ విభాగం వరసగా రెండేళ్లు మొదటి బహుమతి అందుకుంటే తరువాతి సంవత్సరం ఈ పురస్కారం ఇవ్వరు.

అయితేపరిపాలనా సంస్కరణలుప్రజా ఫిర్యాదుల శాఖ గత కొన్నేళ్లుగా అధికార భాష అమలులో నిరంతరం అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందిఅందువల్ల అధికార భాష అమలులో శాఖ కొనసాగిస్తున్న విశిష్ట ప్రతిభకు గుర్తింపుగా ఈ ఏడాది ప్రత్యేక అధికార భాషా శ్రేష్ఠతా పురస్కారాన్ని  ప్రదానం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2310204) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी